ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vijayawada: పంచాయితీ రాజ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన

ABN, First Publish Date - 2023-06-26T13:01:35+05:30

విజయవాడ: ఏపీలోని పంచాయితీ రాజ్ (Panchayat Raj) ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. 9 నెలల నుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేవంటూ పంచాయతీరాజ్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఏపీలోని పంచాయితీ రాజ్ (Panchayat Raj) ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు (Out sourcing Employees) పెద్ద ఎత్తున ఆందోళనకు (Protest) దిగారు. 9 నెలల నుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేవంటూ పంచాయతీరాజ్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ప్ల కార్డ్స్ పట్టుకొని పంచాయతీరాజ్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. తొమ్మిది నెలలుగా అప్పులు చేసుకుని తింటున్నామన్నారు. ఇప్పుడు అప్పు కూడా పుట్టని పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

9 నెలలుగా సీఎస్, సజ్జల రామకృష్ణారెడ్డి, పీఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ సూర్య కుమారి, పంచాయతీరాజ్ మంత్రి ముత్యాల నాయుడు, పెద్దిరెడ్డిని కలిసి తమ సమస్యలు వివరించామని, ఎవరిని జీతాలు గురించి అడిగినా ఎవరూ తమకు న్యాయం చేయలేదని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వాపోయారు. సామరస్యంగా నిరసన తెలుపుతుంటే 9 నెలల జీతాలు ఇచ్చి ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. ఉద్యోగాల నుంచి తొలగిస్తే ఇదే బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామన్నారు. కాగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సుమారు పది సంవత్సరాల నుంచి 15 ఏళ్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు.

Updated Date - 2023-06-26T13:01:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising