ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: వాహనదారులకు గమనిక.. మున్నేరు బ్రిడ్జి మూసివేత

ABN, First Publish Date - 2023-07-29T16:25:55+05:30

భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో నదులు, కాలువలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రస్తుతం వానలు తగ్గుముఖం పట్టినా ప్రవాహం ఏ మాత్రం తగ్గలేదు. దీంతో విజయవాడ-హైదరాబాద్ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఎన్టీఆర్ జిల్లా: భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో నదులు, కాలువలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రస్తుతం వానలు తగ్గుముఖం పట్టినా ప్రవాహం ఏ మాత్రం తగ్గలేదు. దీంతో విజయవాడ-హైదరాబాద్ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెండు, మూడు రోజులుగా భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ప్రవాహం తగ్గుతుందేమోనని ఆశించారు గానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. పైగా భారీ వరదల కారణంగా మున్నేరు బ్రిడ్జి పూర్తిగా దెబ్బతింది. దీంతో వత్సవాయి మండలం పరిధిలోని లింగాల గ్రామం దగ్గర ఉన్న మున్నేరు బ్రిడ్జిని అధికారులు మూసివేశారు. మరోవైపు వత్సవాయి-జగ్గయ్యపేట రూట్లో రాకపోకలు నిలిచిపోయాయి. వత్సవాయి మండలంలోకి వెళ్లేందుకు పెనుగంచిప్రోలు మండలం మీదగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.

Updated Date - 2023-07-29T16:25:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising