Fire Accident : ఆటోమొబైల్ షాపులో అగ్నిప్రమాదం
ABN, First Publish Date - 2023-11-20T09:27:36+05:30
గన్నవరంలోని స్థానిక సినిమా థియేటర్స్ సెంటర్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్‌లోని ఆటోమొబైల్ షాపులో అగ్నిప్రమాదం చోటు చేసేుకుంది. గన్నవరం బీట్ పోలీసులు వెంటనే గన్నవరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
విజయవాడ : గన్నవరంలోని స్థానిక సినిమా థియేటర్స్ సెంటర్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్‌లోని ఆటోమొబైల్ షాపులో అగ్నిప్రమాదం చోటు చేసేుకుంది. గన్నవరం బీట్ పోలీసులు వెంటనే గన్నవరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఆటోమొబైల్ షాపులోని స్పేర్ పార్ట్స్ పూర్తిగా దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి కావడంతో షాపులో ఎవరూ లేరు. దీంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. గన్నవరం పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
Updated Date - 2023-11-20T09:28:03+05:30 IST