ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Amaravati: 107 ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతి ఇవ్వని ఏపీ సర్కార్

ABN, First Publish Date - 2023-08-06T08:20:00+05:30

అమరావతి: ఏపీలో విద్యార్థులకు సోమవారం నుంచి కౌన్సిలింగ్ ప్రారంభకానుంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 107 ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతి ఇవ్వలేదు. రాష్ట్రంలో మొత్తం 227 ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా అందులో కేవలం...

అమరావతి: ఏపీలో విద్యార్థులకు సోమవారం నుంచి కౌన్సిలింగ్ ప్రారంభకానుంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం (Jagan Govt.) 107 ఇంజనీరింగ్ కాలేజీలకు (Engineering Colleges) అనుమతి ఇవ్వలేదు. రాష్ట్రంలో మొత్తం 227 ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా అందులో కేవలం 120 కళాశాలలకు మాత్రమే అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూనివర్సిటీలకు కామన్ సర్వీస్ ఫీజు చెల్లించాలని కళాశాలలకు గతంలో ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అయితే ఆ నోటీసులపై 11 ఇంజనీరింగ్ కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి.

దీనిపై విచారణ జరిపిన హైకోర్టు (High Court).. కామన్ సర్వీస్ ఫీజుపై ఒత్తిడి చేయకుండా ఆన్ లైన్ కౌన్సెలింగ్‌కు అనుమతించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రెగ్యులేటరీ కమిషన్ అశాస్త్రీయంగా ఫీజులు నిర్ణయించిన విషయంలో ఇంజనీరింగ్ కళాశాలల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. ఆ కేసులో ఇంజనీరింగ్ కళాశాలకు కనీస ఫీజు రూ. 43,000గా హైకోర్టు నిర్ధారిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుల నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. మొన్న డిగ్రీ కాలేజీలు, నిన్న పీజీ కాలేజీలు నేడు ఇంజనీరింగ్ కాలేజీలు.. మూతవేత దిశగా రాష్ట్ర విద్యాశాఖ అడుగులు వేస్తోంది.

Updated Date - 2023-08-06T08:20:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising