ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Payyavula Keshav: ఏపీలో ఆర్థిక విస్పోటం.. కాగ్ చెప్పింది..

ABN, First Publish Date - 2023-03-24T14:43:22+05:30

ఏపీ అసెంబ్లీ (AP Assembly) చివరి రోజున.. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ (TDP Members Suspension) తర్వాత కాగ్ నివేదిక (CAG Report) సభలో పెట్టారని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: ఏపీ అసెంబ్లీ (AP Assembly) చివరి రోజున.. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ (TDP Members Suspension) తర్వాత కాగ్ నివేదిక (CAG Report) సభలో పెట్టారని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 1,18,393 నిధులను అసెంబ్లీ అకౌంట్లల్లో కూడా పెట్టలేదని కాగ్ చెప్పిందన్నారు. తప్పకుండా చెల్లించాల్సిన బకాయిలను పద్దుల్లో చూపలేదని, పైనాన్స్ కమిషన్ గ్రాంట్ (Finance Commission Grant) రూ. 480 కోట్లను దారి మళ్లించిందని, పాత అప్పులను తీర్చడానికి కొత్త అప్పులు చేసిందని కాగ్ పేర్కొందన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులను అకౌంట్లల్లో చూపలేదని, ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులను ఖాతాల్లో చూపించకపోవడం నేరమని కాగ్ పేర్కొందన్నారు. అవి ఏ ఖాతాల్లోకి పోతున్నాయో క్లారిటీ లేదని, నిధులను దారి మళ్లిస్తున్నారని తాము గతంలో చెబితే విమర్శించారని.. ఇప్పుడు కాగ్ అదే విషయం చెప్పిందని.. ఏపీలో ఆర్థిక విస్పోటం.. ఇదే విషయం కాగ్ చెప్పిందని పయ్యావుల వ్యాఖ్యానించారు. ఎఫ్ఆర్బీఎంను ఉల్లంఘించిందని, ప్రభుత్వ సంస్థల రుణాలను కూడా చెల్లించాల్సి ఉంటే ప్రభుత్వ ఖాతాల్లో చూపాల్సిందేనని, ప్రభుత్వ గ్యారంటీలను.. అప్పులను దాచారని కాగ్ తన నివేదికలో పేర్కొందని పయ్యావుల కేశవ్ అన్నారు.

Updated Date - 2023-03-24T14:43:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising