B Tech Ravi: సీఎం జగన్‌పై చెక్‌బౌన్స్ కేసు పెడతాం
ABN, First Publish Date - 2023-07-20T15:21:46+05:30
ముఖ్యమంత్రి బటన్ నొక్కినా అమ్మబడి డబ్బులు మాత్రం ఇంకా పడలేదని తెలిపారు. పులివెందుల నియోజకవర్గంలోనే అమ్మఒడి జాబితాను తీసుకుంటే.. రూ. 1179 కోట్లలో ఇంకా 50 శాతం కూడా డబ్బులు పడలేదన్నారు.
కడప: అమ్మఒడి (Amma Odi) డబ్బులకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డిపై (CM jagan) పులివెందుల పోలీస్ స్టేషన్‌లో చెక్ బౌన్స్ కేసు పెడతామని మాజీ ఎమ్మెల్సీ, పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి (B Tech Ravi) అన్నారు. వేంపల్లిలోని ఎస్‌ఎన్‌ఆర్ కళ్యాణ మండపంలో ఇంటిగ్రేటెడ్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి పులివెందుల, వేంపల్లె, చక్రాయపేట, వేముల మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడారు. ముఖ్యమంత్రి బటన్ నొక్కినా అమ్మబడి డబ్బులు మాత్రం ఇంకా పడలేదని తెలిపారు. పులివెందుల నియోజకవర్గంలోనే అమ్మఒడి జాబితాను తీసుకుంటే.. రూ. 1179 కోట్లలో ఇంకా 50 శాతం కూడా డబ్బులు పడలేదన్నారు. అలాగే చీని చెట్లు బీమా కూడా ఇంకా కొంత మంది రైతులకు పడలేదని పేర్కొన్నారు.
Updated Date - 2023-07-20T15:21:46+05:30 IST