ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amravathi: అమరావతి రాజధాని రైతులకు కోటంరెడ్డి సహా పలువురి సంఘీభావం

ABN, First Publish Date - 2023-03-31T11:56:53+05:30

రాజధాని అమరావతి కోసం రైతులు చేపట్టిన ఉద్యమం నేటితో 1200రోజుకు చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: రాజధాని అమరావతి (AP Capital)కోసం రైతులు చేపట్టిన ఉద్యమం నేటితో 1200 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అమరావతి రైతులు, మహిళలకు వివిధ రాజకీయ పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు. ప్రస్తుతం మందడంలో రాజధాని రైతుల ఆందోళన కొనసాగుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Former YCP MLA Kotamreddy Sridhar Reddy), బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ (BJP National Secretary Satya Kumar), మాజీ మంత్రి అది నారాయణ రెడ్డి (Former Minister Adi Narayana Reddy), కాంగ్రెస్ నుంచి ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్ర రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ (APCC President Gidugu Rudra Raju from Congress, Working President Sunkara Padmasree), టీడీపీ నుండి మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ (Former Minister Kanna Lakshminarayana), ఎమ్మెల్సీ పంచుమార్తి అనురాధ (MLC Panchumarthi Anuradha) మందడంలోని రైతుల దీక్షా శిబిరానికి చేరుకుని రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తీ అనురాధ మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఓటమి తరువాత అయినా ముఖ్యమంత్రి కళ్ళు తెరుచుకోడం లేదని విమర్శించారు. అమరావతి మహిళలు పాదయాత్రకు వెళితే ఈ ప్రభుత్వం టాయిలెట్‌ను తీసుకెళ్లిపోయి.. ఇబ్బందులకు గురిచేసిందన్నారు. మహిళలను అనేక ఇబ్బందులు పాలు చేయడంతో వారి రూపు కూడా మారిపోయిందన్నారు. అమరావతికి ప్రతి టీడీపీ కార్యకర్త మద్దతుగా ఉంటారని స్పష్టం చేశారు.

అమరావతికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది: గిడుగు రుద్రరాజు

కాంగ్రెస్ పార్టీ అమరావతికి కట్టుబడి ఉంటుంది అని రాహుల్ గాంధీ చెప్పారని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్ర రాజు అన్నారు. ఉద్యమానికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ ఆది నుంచి అందుబాటులో ఉన్నారని తెలిపారు. అమరావతికి రాష్ట్ర కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

అమరావతిని నిలబెట్టుకుని తీరుతాం: సుంకర

అమరావతి కోసం 34 వేల ఎకరాలు, 29 గ్రామాలు, ఐదుకోట్ల ప్రజల కోసం త్యాగం చేశారన్నారు. అమరావతి స్కాం కాదు అని సుప్రీంకోర్టులో నిరూపణ అయినా రాజకీయ లబ్ది కోసం రైతు కంట కన్నీరు తెప్పిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి సిగ్గు లేకుండా పరదాల చాటున వెళుతున్నారని విమర్శించారు. 1200 రోజులుగా వందలాది కేసులతో ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. అమరావతిని నిలబెట్టుకుని తీరుతామని స్పష్టం చేశారు. వైసీపీ నేతలే అమరావతి ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారన్నారు. కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి ఒక్కరు మనకు తుఫానులో అండగా నిలబడ్డారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా అన్యాయం చేస్తున్నాయని... అందుకే వారిని హెచ్చరిస్తున్నామని అన్నారు. ప్రధాని స్వయంగా శంకుస్థాపన చేసిన ప్రాంతమిదని... కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం ఇక్కడ కేంద్ర సంస్థలకు శంకుస్థాపన చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ అమరావతి రాజధానికి అండగా ఉంటాం అని చెప్పారని పేర్కొన్నారు.

Updated Date - 2023-03-31T12:51:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising