ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Amaravati: మాజీ మంత్రి నక్కా ఆనంద బాబును అడ్డుకున్న పోలీసులు

ABN, First Publish Date - 2023-09-24T13:54:12+05:30

అమరావతి: రాజమండ్రి వెళ్తున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబును పోలీసులు అడ్డుకున్నారు. నల్లజర్ల టోల్ గేట్ వద్ద ఆపిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

అమరావతి: రాజమండ్రి వెళ్తున్న టీడీపీ సీనియర్ నేత (TDP Senior Leader), మాజీ మంత్రి (Ex Minister) నక్కా ఆనంద బాబు (Nakka Anandababu)ను పోలీసులు అడ్డుకున్నారు. నల్లజర్ల టోల్ గేట్ వద్ద ఆపిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు కుటుంబసభ్యులను (Chandrababu Family) పరామర్శించేందుకు నక్కా ఆనందబాబు, కనపర్తి శ్రీనివాసరావు, బుచ్చి రాం ప్రసాద్, వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ (బుజ్జి) తదితరులు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు (TDP Leaders) ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ.. ఐటీ ప్రొఫెషనల్స్ (IT Professionals) హైదరాబాద్ (Hyderabad) నుంచి ఏపీ (AP)కి వస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకెళ్లి చంద్రబాబుకు సంఘీభావం తెలపనున్నారు. భారీగా ఐటీ ప్రోఫెషనల్స్ హైదరాబాద్ నుంచి తరలి వస్తున్నట్టు ఏపీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో తెలంగాణ బోర్డర్ వద్ద భారీగా పోలీసుల మొహరించారు. హైదరాబాద్ వైపు నుంచి వస్తోన్న వాహానాలను తనిఖీ చేస్తున్నారు.

పలువురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఖమ్మం మీదుగా రాజమండ్రికి వెళ్తున్నారు. బ్యాచులుగా విడిపోయి రాజమండ్రి వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బోర్డర్ వద్ద ఐడి కార్డులు.. వివరాలను తెలుసుకున్న తర్వాతే వాహనాలను వదిలిపెడుతున్నారు. ఇప్పటికే ఐటీ ప్రొఫెషనల్స్ వివిధ మార్గాల ద్వారా రాజమండ్రికి చేరుకున్నట్టు సమాచారం.

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌ ఐటీ కంపెనీ ఉద్యోగులు ఆదివారం తలపెట్టిన ‘చలో రాజమండ్రి’ కార్యక్రమాన్ని కట్టడి చేసేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు వద్ద హైఅలర్ట్‌ ప్రకటించారు. ఐటీ ఉద్యోగుల ఆందోళనకు అనుమతి లేదంటూ వారిని సరిహద్దు వద్ద అడ్డుకునేందుకు భారీగా బలగాలను రంగంలోకి దించారు. సరిహద్దు వద్ద మూడంచెల్లో దాదాపు 250 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ డీసీసీ అనిత, నందిగామ ఏసీపీలు ప్రత్యేక దృష్టి సారించారు.

Updated Date - 2023-09-24T13:54:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising