ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ వైపు మాజీమంత్రి సుచరిత భర్త చూపు..!

ABN, First Publish Date - 2023-01-05T21:31:53+05:30

అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగా జరగటం ఖాయమనే ప్రచారం జోరుగా జరుగుతుండటంతో వైసీపీ నేతల స్వరాలు మారుతున్నాయి. మొన్న ఆనం రాంనారాయణరెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగా జరగటం ఖాయమనే ప్రచారం జోరుగా జరుగుతుండటంతో వైసీపీ నేతల స్వరాలు మారుతున్నాయి. మొన్న ఆనం రాంనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy), నిన్న వసంత, నేడు అదే కోవలోకి గుంటూరు జిల్లా (Guntur District)కు చెందిన మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత (Sucharita) చేరి తన స్వరం మార్చారు. ఇప్పటి వరకు ఆమె రాజకీయాల్లో ఉన్నంత వరకు వైఎస్‌ఆర్‌ కుటుంబాన్ని వీడేదిలేదని చెప్పిన ఆమె.. కొత్త భాష్యంతో ఏ నిమిషానైనా తాను పార్టీ మారే అవకాశం ఉందని కార్యకర్తలతో చెప్పినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం తన నియోజకవర్గం పరిధిలోని కాకుమానులో జరిగిన పార్టీ కార్యకర్తల అంతర్గత సమావేశంలో ఆమె మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌లు గురువారం సోషల్‌ మీడియా (Social media)లో విస్తృతంగా వైరల్‌ అయ్యాయి.

వైఎస్‌ కుటుంబానికి ఎంతో విశ్వసనీయురాలైనా సుచరిత వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేకెత్తించింది. మంత్రి పదవి నుంచి ఆమెను తప్పించటమే కాకుండా జిల్లా అధ్యక్ష పదవికి దూరం చేయటంతో ఆమె మనస్థాపంతో రగిలిపోతున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనకు హోంమంత్రి పదవి పేరు కోసమే ఇచ్చారే తప్ప ఎటువంటి అధికారం ఇవ్వలేదని అప్పట్లోనే ఆమె వాపోయిన సందర్భాలున్నాయి. ఇన్‌కంటాక్స్‌ కమిషనర్‌గా పనిచేసిన సుచరిత భర్త దయాసాగర్‌ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అది కూడా టీడీపీ తరుపునే పోటీ చేయాలనే ఆకాంక్షతో ఆయన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్య నేతలతో కూడా ఆయనకు సన్నిహిత సంబందాలున్నాయి.

Updated Date - 2023-01-05T21:31:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising