ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

DGP Rajendranath Reddy: లా అండ్ ఆర్డర్‌ను దెబ్బ తీస్తే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2023-08-12T15:38:03+05:30

లా అండ్ ఆర్డర్‌(Law and order)ను దెబ్బతీసే విధంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే ఎవరినీ ఉపేక్షించమని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి (AP DGP Rajendranath Reddy)అన్నారు.

పగో (నరసాపురం): లా అండ్ ఆర్డర్‌(Law and order)ను దెబ్బతీసే విధంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే ఎవరినీ ఉపేక్షించమని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి (AP DGP Rajendranath Reddy)అన్నారు. శనివారం నాడు నరసాపురంలో డిజిపి రాజేంద్రనాథ్ పర్యటించారు. ఈసందర్భంగా మీడియాతో్ మాట్లాడుతూ.. పుంగనూరులో పోలీసులపై అల్లరి మూకలు చేసిన దాడులను ఖండించారు. ‘‘ఈ కేసులో ఇప్పటివరకు 80 మందిని అరెస్టు చేశాం.పోలీసులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవు.దాడికి పాల్పడింది స్థానికులా, లేక బయట వ్యక్తులా అన్నదానిపై లోతైన విచారణ చేస్తాం. పోలీసు వ్యవస్థ అందరికోసం పనిచేస్తుందని రాజకీయ పార్టీలు గుర్తించి సహకరించాలి. రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో కొత్త ఒరవడి సృష్టించాం.1.40 లక్షల మంది మహిళలు దిశా యాప్‌(Disha app)లో రిజిస్టర్ అయ్యారు. ఇప్పటి వరకు 27వేల మంది మహిళలు ఈ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో 20 శాతం నేరాలు తగ్గుముఖం ముట్టాయి. విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు తగ్గింది.గత ఏడాది 7500 ఎకరాల్లో గంజాయి సాగు ఉంటే ఇప్పుడు 1000 ఎకరాల్లోనే ఉంది. నిర్దిష్టమైన ప్రణాళికలతో రాష్ట్రంలో గంజాయి నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. సైబర్ నేరాలు తగ్గింపునకు ప్రతి జిల్లాలో 8 మందితో టీం ఏర్పాటు చేస్తాం. నేరస్తులు నేరాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు’’ అని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2023-08-12T15:38:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising