ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CPM Leader: ఏపీలో అస్సలు ప్రభుత్వం ఉందా? అంటూ సీఎం జగన్‌పై విమర్శలు

ABN, Publish Date - Dec 26 , 2023 | 03:15 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు.

నెల్లూరు: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. ఏపీలో అస్సలు ప్రభుత్వం ఉందా? అంటూ సీఎం జగన్‌పై సీపీఎం నేత శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ఏపీలో అస్సలు ప్రభుత్వం ఉందా? అనే అనుమానం వస్తుంది. సీఎం జగన్... నా అక్కచెల్లెమ్మలు అంటుంటారు. 15 రోజులుగా అంగన్ వాడీ ఆడబిడ్డలు రోడ్డు ఎక్కితే పట్టించుకోరు. ఏపీలో 30 లక్షల మంది తల్లులు, పిల్లలకి పౌష్టికాహారం అందడం లేదు. మా నమ్మకం నువ్వే అంటారు. ఇదేనా నమ్మకం. అన్ని విభాగాల కాంట్రాక్ట్ ఉద్యోగులు, కార్మికులు సమ్మెలకు దిగుతున్నా పట్టించుకోరు. ప్రభుత్వం వద్ద డబ్బులు ఉన్నాయి. లేకుంటే రూ.20 వేల కోట్లుతో స్మార్ట్ మీటర్లు ఎలా పెడుతున్నారు. అది కూడా అదానీకి అప్పగించారు. కరెంటు బిల్లులకంటే అదనపు ఛార్జీలు వసూలు చేస్తూ జనం మాడు పగులగొడుతున్నారు." అని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Dec 26 , 2023 | 03:15 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising