ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shanti Priya Pandey: బోనులో చిక్కింది ఆ చిరుతే అయితే మాత్రం..!

ABN, First Publish Date - 2023-08-14T15:14:59+05:30

తిరుమల కాలినడక మార్గంలో ఔట్ పోస్ట్ ఏర్పాటు చేయాలి. క్యాప్చర్ కెమెరాలు ఏర్పాటు చేయాలి. 100 మీటర్ల వ్యవధిలో కెమెరాలు ఉండాలి. సాయంత్రం భక్తుల సంఖ్య తగ్గించాలి. గతంలో బాలుడిపై దాడి చేసిన చిరుత.. ఇప్పుడు బంధించిన చిరుత ఒకటేనా? లేదంటే

తిరుపతి: వన్య మృగాల కదలికల ఆధారంగా తిరుమలకు భక్తులను అనుమతించాలని అధికారులకు ఫారెస్ట్ అధికారి శాంతి ప్రియ పాండే సూచించారు. తిరుమలలో చిరుత దాడిపై అటవీశాఖ ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం జరిగింది. అనంతరం శాంతి ప్రియ పాండే మీడియాతో మాట్లాడారు. ‘‘తిరుమల కాలినడక మార్గంలో ఔట్ పోస్ట్ ఏర్పాటు చేయాలి. క్యాప్చర్ కెమెరాలు ఏర్పాటు చేయాలి. 100 మీటర్ల వ్యవధిలో కెమెరాలు ఉండాలి. సాయంత్రం భక్తుల సంఖ్య తగ్గించాలి. గతంలో బాలుడిపై దాడి చేసిన చిరుత.. ఇప్పుడు బంధించిన చిరుత ఒకటేనా? లేదంటే మరొకటా? అన్నదానిపై బ్లడ్ శాంపిల్ తీస్తాం. ఇప్పుడు బోనులో పడ్డ చిరుత పాపపై దాడి చేసినట్టుగా పరీక్షలో తేలితే దాన్ని శాశ్వతంగా జూలో ఉంచుతాం. ఒకసారి మనిషిని తిన్న చిరుత మళ్లీ మనుషులపై దాడి చేసే అవకాశం ఉంది.’’ అని ఆమె చెప్పుకొచ్చారు.

ఇటీవల తిరుమల నడకదారిలో ఆరేళ్ల చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి ప్రాణాలు తీసింది. దీంతో టీటీడీ, ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమై మధ్యాహ్నం 2 గంటల తర్వాత చిన్నారులను అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు. అలాగే మరో ఐదు చిరుతలు సంచరిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. చిరుతలతో పాటు ఎలుగబంటి తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో నడకదారిపై కొన్ని ఆంక్షలు విధించే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు.

Updated Date - 2023-08-14T15:14:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising