ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP NEWS: కలెక్టర్లు, ఎస్పీలకు కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు

ABN, Publish Date - Dec 22 , 2023 | 09:55 PM

జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల కమిషన్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సీఈసీ సీనియర్ అధికారులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కీలక ఆదేశాలు ఇచ్చారు.

అమరావతి: జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల కమిషన్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సీఈసీ సీనియర్ అధికారులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కీలక ఆదేశాలు ఇచ్చారు. రాజకీయ పక్షాలు ఇచ్చిన ఫిర్యాదులపై క్షుణ్ణంగా విచారణ చేయాలని ఆదేశించారు. కృష్ణా, గుంటూరు, కాకినాడ, బాపట్ల జిల్లాల్లో వచ్చిన కంప్లైంట్స్ పై ఎటువంటి చర్యలు తీసుకున్నారని కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ప్రశ్నించారు. 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో చోటు చేసుకున్న ఘటనలను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించారు.

పోలింగ్ బూత్‌లో జరిగిన అల్లర్లు, సిబ్బందిపై దాడి చేసిన వారిపై నమోదు అయిన కేసులు గురించి అధికారులు ఆరా తీశారు. కమిషన్‌కు వచ్చిన ఫిర్యాదును తేలికగా తీసుకోవద్దని ఆదేశించారు. పలు అంశాలపై కలెక్టర్లు ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 26 వరకు సమయం ఉండటంతో అన్ని ఫిర్యాదులపై వెంటనే క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

Updated Date - Dec 22 , 2023 | 09:57 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising