ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: సీఎంను దూషించిన కానిస్టేబుల్‌పై కోర్టు తీర్పు ఇదే

ABN, First Publish Date - 2023-02-04T15:23:16+05:30

కానిస్టేబుల్ తన్నీరు వెంకటేశ్వరరావు (AR CONSTABLE TANNIRU VENKATESWARA RAO )కు బెయిల్ మంజూరు చేశారు.

అమరావతి: కానిస్టేబుల్ తన్నీరు వెంకటేశ్వరరావు (AR CONSTABLE TANNIRU VENKATESWARA RAO )కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వేతనాలపై సీఎం (CM)ను దూషించారని నిన్న వెంకటేశ్వరరావును రిమాండ్కు తరలించారు. బెయిల్ పిటిషన్పై ఇవాళ జగ్గయ్యపేట కోర్టులో వాదనలు జరిగాయి. వెంకటేశ్వరరావు తరపున న్యాయవాదులు దొద్దాల కోటేశ్వరరావు, మాగులూరి హరిబాబు వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు వెంకటేశ్వరరావుకు బెయిల్ మంజూరు చేసింది.

అసలేం జరిగిందంటే... నందిగామ చిల్లకల్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో హైవే పెట్రోలింగ్‌ విభాగంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా వెంకటేశ్వరరావు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల గౌరవరం గ్రామంలో టీ తాగేందుకు ఓ టీస్టాల్ దగ్గర ఆగిన సమయంలో టీస్టాల్ వ్యక్తికి, కానిస్టేబుల్‌కు మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెంకటేశ్వరరావును బాగున్నారా అంటూ పలకరించిన సదరు వ్యక్తి జీతాలపై ప్రశ్నించారు. సీఎం జగన్ జీతాలు ఇస్తున్నారా అంటూ అడిగారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బండబూతులు తిట్టారు. వెంకటేశ్వరరావు తిట్ల పురాణాన్ని సదరు టీస్టాల్ వ్యక్తి రికార్డు చేసి మరీ పోలీస్ ఉన్నతాధికారులకు పంపించాడు. వెంటనే స్పందించిన పోలీసులు.. వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఉద్దేశపూర్వకంగా వెంకటేశ్వరరావును రెచ్చగొట్టారని... ఆయన నిజాయితీ గల పోలీసంటూ పోలీస్ వర్గాల్లో చర్చ తీవ్రస్థాయిలో జరుగుతోంది.

Updated Date - 2023-02-04T15:28:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising