ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ‘దానికి ముచ్చటగా మూడోసారి ఉత్తుత్తి శంఖుస్థాపన చేశారు’

ABN, First Publish Date - 2023-05-22T20:10:33+05:30

కమీషన్లు, భూములు కొట్టేయడానికే జగన్ రెడ్డి బందర్ పోర్ట్ నిర్మాణానికి ముచ్చటగా మూడోసారి ఉత్తుత్తి శంఖుస్థాపన చేశారని మాజీమంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కమీషన్లు, భూములు కొట్టేయడానికే జగన్ రెడ్డి బందర్ పోర్ట్ నిర్మాణానికి ముచ్చటగా మూడోసారి ఉత్తుత్తి శంఖుస్థాపన చేశారని మాజీమంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) మండిపడ్డారు. పవర్ పర్చేజ్ కార్పొరేషన్ నుంచి రుణం తీసుకోవడానికే ముఖ్యమంత్రి కొత్తనాటకమని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి 6,200 ఎకరాల్లో పోర్టు నిర్మిస్తామంటే, జగన్‌రెడ్డి నేడుదాన్ని 1800 ఎకరాలకే పరిమితం చేయడం ఎవర్ని మోసగించడానికి?, జగన్ రెడ్డి రెండున్నరేళ్లలో పూర్తిచేస్తానంటుంది పోర్టునా..లేక ఫిషింగ్ హార్బర్‌నా? అని ఆయన ప్రశ్నించారు. పాత డీపీఆర్ కాదని తయారు చేసిన కొత్త డీపీఆర్ బయటపెడితే జగన్‌రెడ్డి పోర్టు నిర్మాణం బట్టబయలవుతుందన్నారు. గతంలో జగన్‌రెడ్డి పోర్టునిర్మాణం పేరుతో మైటాస్ సంస్థనుంచి రూ.400కోట్లు కొట్టేయలేదా?, పోర్టు నిర్మాణాన్ని తాకట్టుపెట్టి పదవులుపొందిన పేర్నినాని ఎన్నాళ్లు ప్రజల్నిమోసగిస్తాడు? అని ఆయన ప్రశ్నించారు. గంగవరం, కృష్ణపట్నం పోర్టులతోపాటు, బందర్ పోర్ట్ నిర్మాణాన్ని ఎప్పటికైనా పూర్తిచేసేది చంద్రబాబేనన్నారు. ఎక్కడోఉన్న పేదలకు అమరావతిలో ఇళ్లస్థలాలు ఇస్తానంటున్న జగన్‌రెడ్డికి రాజధానిలోని పేదలు కనిపించడంలేదా?, భూములిచ్చి సర్వంకోల్పోయిన వారికి న్యాయంచేయని ముఖ్యమంత్రి పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తాడా?, చంద్రబాబు పేదలకోసం కట్టించిన టిడ్కోఇళ్లను 4ఏళ్లుగా జగన్ వారికి ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు.

Updated Date - 2023-05-22T20:10:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising