ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ‘గాల్లో ప్రయాణిస్తుంటే... హైవేపై వాహనాలు నిలిపివేయడం ఏమిటి?’

ABN, First Publish Date - 2023-05-03T21:15:05+05:30

సీఎం జగన్ (CM Jagan) గాల్లో ప్రయాణిస్తుంటే... హైవే మీద వాహనాలు నిలిపివేయడం ఏమిటి? అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్ (CM Jagan) గాల్లో ప్రయాణిస్తుంటే... హైవే మీద వాహనాలు నిలిపివేయడం ఏమిటి? అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు అడుగుపెడితే హెలికాప్టర్ ఎక్కే ముఖ్యమంత్రికి.. హైవే మీద వాహనాలు ఏ విధంగా అడ్డంకి అవుతాయో అర్థం కావడం లేదన్నారు. భోగాపురం విమానాశ్రయానికి రెండోసారి శంకుస్థాపన కోసం జగన్ రెడ్డి గాల్లో ప్రయాణించి వెళ్తే... అటు శ్రీకాకుళం జిల్లా పలాస దగ్గర, ఇటు అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర జాతీయ రహదారిపై వాహనాలు నిలిపివేయడం విచిత్రంగా ఉందన్నారు. గంటల తరబడి వాహనాలు ఆపివేయడం వల్ల వాహనదారులు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారని తెలిపారు. రోడ్డు మీదకు వస్తే పరదాలు కట్టించుకోవడం, దుకాణాలు మూసివేయడం లాంటి చర్యలు చూస్తుంటే.. ముఖ్యమంత్రి రోజురోజుకీ అభద్రతాభావం పెరిగిపోతోందన్నారు. పోలీసుల అత్యుత్సాహానికి పరాకాష్టగా భోగాపురానికి అటూ ఇటూ 150 కి.మీ. దూరాన హైవేపై వాహనాలు ఆపివేయడం వల్ల సామాన్యులు ఇబ్బందిపడుతున్నారని సూచించారు. సీఎం భోగాపురం పర్యటన నేపథ్యంలో జనసేన నాయకులను అరెస్టులు చేయడం, గృహ నిర్బంధాలు చేయడం అప్రజాస్వామికమన్నారు. ఈ అక్రమ నిర్బంధాలను ఖండిస్తున్నామన్నారు.

Updated Date - 2023-05-03T21:20:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising