Ap govt: సచివాలయాల ఉద్యోగుల బదిలీల విధివిధానాలను విడుదల చేసిన ఏపీ సర్కార్
ABN, First Publish Date - 2023-05-25T22:32:40+05:30
గ్రామ వార్డు విలేజ్ వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు విధివిధానాలను ఏపీ సర్కార్ విడుదల చేసింది.
అమరావతి: గ్రామ వార్డు విలేజ్ వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు విధివిధానాలను ఏపీ సర్కార్ విడుదల చేసింది. 2019, 2020 లో ఉద్యోగం పొంది రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఎనర్జీ అసిస్టెంట్ మినహా మిగిలిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. బదిలీ కోసం దరఖాస్తును ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి. గతంలో ఉద్యోగం పొందిన జిల్లాలో మాత్రమే బదిలీలు చేయబడతాయని పేర్కొంది. 20 శాతానికి మించి ఉద్యోగులను స్థానచలనం కల్పించడానికి వీలు లేదని, అర్బన్ లోకల్ బాడీలో 50శాతం ఖాళీలు ఉన్నచోట ఎంతమంది బదిలీ అయితే అంత మందితో ఆ స్థానాలను భర్తీ చేయాలి. ఏసీబీ, విజిలెన్స్ కేసులు ఉన్న ఉద్యోగులు బదిలీలకు అనర్హులు, బదిలీలు కోరుకునేవారు ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ నుంచి నో డ్యూ సర్టిఫికెట్ జత చేయాలని పేర్కొంది. ఈ మేరకు జీవో ఎంఎస్ నెంబర్ ఐదును విడుదల చేసినట్లు ఏపీ సర్కార్ తెలియజేసింది.
Updated Date - 2023-05-25T22:35:26+05:30 IST