ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP DGP: వాలంటీర్లపై చర్చ నేపథ్యంలో ఏపీ డీజీపీ కీలక ఆదేశాలు

ABN, First Publish Date - 2023-07-21T21:23:39+05:30

రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల (volunteers) విధివిధానాలపై జరుగుతున్న చర్చ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల (volunteers) విధివిధానాలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. తక్షణమే మహిళా పోలీసులను ఎటువంటి పోలీస్ విధులకు వినియోగించద్దంటూ ఏపీ డీజీపీ (AP DGP) రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.


గ్రామ వార్డు, సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులను పోలీస్ శాఖలో బందోబస్త్, రిసెప్షన్, శాంతి భద్రతలు వంటి అంశాలకు వినియోగించవద్దంటూ ఆదేశాలు ఇచ్చారు. మహిళా పోలీసులను తరచూ పోలీస్ స్టేషన్లకు పిలిపించడం లాంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని, పోలీస్ అధికారులు ఎవరైన మహిళా పోలీసులను వినియోగించినట్లు అయితే వారిపై కఠిన చర్యలు తప్పవని డీజీపీ స్పష్టం చేశారు. అన్ని జిల్లాల పోలీస్ కమిషనర్లు, రేంజ్ డీఐజీలకు, ఎస్‌పీలకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2023-07-21T21:29:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising