AP News: అంగన్వాడీలకు ఉన్నతాధికారుల బెదిరింపులు
ABN, Publish Date - Dec 14 , 2023 | 12:32 PM
Andhrapradesh: నిరవధిక సమ్మెలో ఉన్న అంగన్వాడీలను ఉన్నతాధికారులు బెదిరింపులకు గురిచేస్తున్నారు. అనంతపురం కలెక్టరేట్ వద్ద నిరసన శిబిరం వద్దకు వచ్చి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్‌ను పీడీ శ్రీదేవి బెదిరింపులకు గురిచేశారు.
అనంతపురం: నిరవధిక సమ్మెలో ఉన్న అంగన్వాడీలను ఉన్నతాధికారులు బెదిరింపులకు గురిచేస్తున్నారు. అనంతపురం కలెక్టరేట్ వద్ద నిరసన శిబిరం వద్దకు వచ్చి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్‌ను పీడీ శ్రీదేవి బెదిరింపులకు గురిచేశారు. అంగన్వాడి కేంద్రాలు ప్రభుత్వ ఆస్తి అని... వాటి బీగాలను పగలగొట్టే హక్కు ప్రభుత్వానికి ఉందంటూ పీడీ శ్రీదేవి బెదిరింపు దోరణితో మాట్లాడారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్‌కు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయంటూ గొప్పలు చెబుతూ ప్రభుత్వంపై పొగడ్తలు కురిపించారు. పీడీ శ్రీదేవి చేసిన వ్యాఖ్యలపై సీఐటీయూ నేత నాగేంద్ర మండిపడ్డారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొడితే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామంటూ హెచ్చరించారు. తమ పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కరించడం లేదంటూ పీడీ శ్రీదేవిని అంగన్వాడీలు నిలదీశారు. అయితే సమాధానం చెప్పకుండానే శ్రీదేవి అక్కడి నుంచి దురుసుగా వాహనం ఎక్కి వెళ్లిపోయారు. పీడీ శ్రీదేవి వ్యవహార తీరుపై సీఐటీయు అంగన్వాడీలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Dec 14 , 2023 | 12:32 PM