ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Paritala Sriram: సొంత బాబాయ్‌ను చంపిన వాడు.. బాబు అరెస్ట్ చేయించడా?

ABN, First Publish Date - 2023-09-13T13:29:53+05:30

సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

శ్రీ సత్యసాయి జిల్లా : సీఎం జగన్ మోహన్ రెడ్డిపై (CM Jagan reddy) టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ (TDP Leader Paritala Sriram) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ధర్మవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద బాబుతోనే నేను కార్యక్రమంలో టీడీపీ నేతలతో కలసి పరిటాల శ్రీరామ్ రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘‘సొంత బాబాయ్‌ను చంపిన వాడు.. చంద్రబాబును అరెస్ట్ చేయించడా? అంటూ మండిపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్‌లో ప్రతి రూపాయికి లెక్క ఉందని... అయినా చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసినా తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. ప్రతి రూపాయికి లెక్క చూపిస్తామని అధికారులే చెబుతున్నారని.. అయినా అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారని మండిపడ్డారు. ఈ కేసులు తమను ఏమీ చేయలేవన్నారు. తాము ప్రజల కోసమే ఈ దీక్షలు, నిరసనలు తెలియజేస్తున్నామని అన్నారు. ప్రజలు, ఉద్యోగులు, పోలీసులు కూడా ఈ పోరాటంలో కలసి రావాలని పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు.

Updated Date - 2023-09-13T13:29:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising