ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu news: సీఐడీ కస్టడీకి చంద్రబాబు.. ఏసీబీ కోర్ట్ సంచలన తీర్పు

ABN, First Publish Date - 2023-09-22T15:05:34+05:30

స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో (Skill development case) అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు ప్రతికూల తీర్పు వెలువడింది. ఆయనను రెండు రోజులపాటు సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. 5 రోజులపాటు కస్టడీకి అప్పగించాలని సీఐడీ అధికారులు కోరినప్పటికీ 2 రోజులు ఇస్తున్నట్టు స్పష్టం చేసింది.

విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో (Skill development case) అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు ప్రతికూల తీర్పు వెలువడింది. ఆయనను రెండు రోజులపాటు సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. 5 రోజులపాటు కస్టడీకి అప్పగించాలని సీఐడీ అధికారులు కోరినప్పటికీ 2 రోజులు ఇస్తున్నట్టు స్పష్టం చేసింది.


స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నిధులు ఎటు మళ్ళించారనే దానిపై విచారించాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టులో వాదించారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది వెలుగులోకి వస్తాయని ఏసీబీ కోర్టుకు సీఐడీ తరుపున న్యాయవాదులు విన్నవించారు. దీంతో సీఐడీ తరపు న్యాయవాది వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. చంద్రబాబును రెండు రోజులు పాటు కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది.


ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు...

చంద్రబాబు విచారణ సమయం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఉంటుందని న్యాయమూర్తి చెప్పారు. న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మీడియాకు విచారణకు సంబంధించిన వివరాలు వెల్లడించకూడదని హెచ్చరించింది. చంద్రబాబు ఆరోగ్య రీత్యా, వయసు రీత్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కస్టడీ ముగిసిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాలని కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు కస్టడీ విచారణ అంశాలను కోర్టు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

Updated Date - 2023-09-22T15:11:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising