Naini Rajender Reddy: ద్రోహంచేసే కోవర్టులు మా పార్టీలో ఉన్నారు
ABN, First Publish Date - 2022-12-24T12:46:00+05:30
కన్నతల్లిలాంటి పార్టీకి ద్రోహంచేసే కోవర్టులు తమ పార్టీలో ఉన్నారని హనుమకొండ డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
హనుమకొండ: కన్నతల్లిలాంటి పార్టీకి ద్రోహంచేసే కోవర్టులు తమ పార్టీలో ఉన్నారని హనుమకొండ డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్ రెడ్డి (DCC President Naini Rajender Reddy) అన్నారు. శనివారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ... గతంలో కూడా తనపై ఇలాంటి చిల్లర రాజకీయాలు చేశారని మండిపడ్డారు. కోవర్టులు, పార్టీకి ద్రోహం చేసేవారిని గుర్తించామన్నారు. సాక్షాధారాలతో సహా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. పోస్టర్లు వేసిన దుర్మార్గులపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానన్నారు. బీఆర్ఎస్ నేతల అక్రమాలపై ప్రశ్నిస్తే తమ పార్టీలోని కోవర్టులతో ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని నాయిని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2022-12-24T12:46:01+05:30 IST