ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Political war: బీజేపీ ఆఫీస్ దగ్గర టెన్షన్.. టెన్షన్

ABN, First Publish Date - 2022-11-18T14:57:43+05:30

తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. బీజేపీ-టీఆర్ఎస్ నేతల మధ్య ఓ వైపు మాటల-తూటాలు పేలుతుంటే.. మరోవైపు ఇరుపార్టీల కార్యకర్తలు మాత్రం ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. కవిత(TRS MLC Kavita)పై చేసిన

టెన్షన్.. టెన్షన్
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. బీజేపీ-టీఆర్ఎస్ నేతల మధ్య ఓ వైపు మాటల-తూటాలు పేలుతుంటే.. మరోవైపు ఇరుపార్టీల కార్యకర్తలు మాత్రం ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. కవిత(TRS MLC Kavita)పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ఎంపీ అరవింద్(BJP MP Arvind) నివాసంపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఇంట్లో పర్నిచర్, అద్దాలు ధ్వంసం చేసి నానా హంగామా సృష్టించారు. ఇదిలా ఉంటే.. ‘ఇష్టం వచ్చినట్లు వాగితే.. నిజామాబాద్ చౌరస్తాలో అరవింద్‌ను చెప్పుతో కొడతానని’ కవిత ఘాటుగా హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. మరోవైపు అరవింద్ ఇంటిపై దాడిని నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలు కూడా ప్రగతిభవన్‌ ముట్టడికి వ్యూహం రచించారు. బీజేపీ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు బయల్దేరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు-బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఒక్కసారిగా టెన్షన్.. టెన్షన్‌గా మారింది. బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలిస్తున్నారు.

Updated Date - 2022-11-18T15:01:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising