ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్రవంతి కాన్వాయ్‌పై దాడి!

ABN, First Publish Date - 2022-10-24T03:16:17+05:30

మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఆదివారం నాంపల్లి మండలంలో స్రవంతి ప్రచారానికి వెళ్తుండగా.. ఆమె కారును ముష్టిపల్లి, పెద్దాపురం గ్రామాల మధ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ పార్టీ ఓటమికి సంకేతం: రేవంత్‌రెడ్డి

ఓటమి భయంతోనే దాడులు: ఉత్తమ్‌

నాంపల్లి/హైదరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఆదివారం నాంపల్లి మండలంలో స్రవంతి ప్రచారానికి వెళ్తుండగా.. ఆమె కారును ముష్టిపల్లి, పెద్దాపురం గ్రామాల మధ్య బీజేపీ కార్యకర్తలు ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనతో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. పెద్దాపురం గ్రామంలో బీజేపీ కార్యకర్తల వాహనాన్ని నిలిపి.. స్రవంతి కారు డ్రైవర్‌ వారి వద్దకు వెళ్లి ప్రశ్నించాడు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుని స్రవంతి వాహనంపై బీజేపీకి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై స్రవంతి.. జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరికి ఫిర్యాదు చేశారు. తమపై దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దాడిని నిరసిస్తూ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, పున్న కైలా్‌షనేత, కిరణ్‌కుమార్‌రెడ్డి తదితర నేతలతో కలిసి నాంపల్లిలో స్రవంతి ఆందోళన చేపట్టారు.

ఓడిపోతామనే భయంతోనే బీజేపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాగా, స్రవంతిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. స్రవంతిపై బీజేపీ దాడి.. ఆ పార్టీ ఓటమికి సంకేతమన్నారు. ఆడబిడ్డపై దాడి చేసి ఎన్నికలో గెలవాలనుకోవడం చేతగానితనమన్నారు. ఎన్నికల కమిషన్‌ బీజేపీ అభ్యర్థిని పోటీ నుంచి బహిష్కరించాలని ట్విటర్‌లో రేవంత్‌ డిమాండ్‌ చేశారు. కాగా, ఓటమి భయంతోనే కాంగ్రెస్‌ అభ్యర్థి స్రవంతిపై బీజేపీ దాడులకు దిగుతోందని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఽఅన్నారు. మునుగోడు ప్రజలకు, కాంగ్రెస్‌ పార్టీకి ద్రోహం చేసిన రాజగోపాల్‌రెడ్డి.. ఇప్పుడు భౌతిక దాడులకు కూడా తెగబడుతున్నారని మండిపడ్డారు.

Updated Date - 2022-10-24T03:17:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising