ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayashanti: సంజయ్ భైంసా పాదయాత్ర అనే సరికి కేసీఆర్‌కి వణుకు

ABN, First Publish Date - 2022-11-28T22:23:42+05:30

బీజేపీ నేతల(BJP Leaders) పాదయాత్రలంటే... అవేవో తన గుండెల మీద తన్నుతున్న ఇనుప పద ఘట్టనల్లా సీఎం కేసీఆర్‌(CM KCR)కి అనిపిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బీజేపీ నేతల(BJP Leaders) పాదయాత్రలంటే... అవేవో తన గుండెల మీద తన్నుతున్న ఇనుప పద ఘట్టనల్లా సీఎం కేసీఆర్‌(CM KCR)కి అనిపిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు. సోమవారం రాములమ్మ సోషల్ మీడియాలో ఓ వార్త పోస్ట్ చేశారు. ఆ వార్తను యథప్రకారం ఇస్తున్నాం. ‘‘తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్(Bandi Sanjay) భైంసా పాదయాత్ర (Bhainsa Padayatra) అనే సరికి కేసీఆర్‌, టీఆర్ఎస్‌, సయామీ కవల పార్టీ అయిన ఎంఐఎం(MIM) పెద్దలకు మరికాస్త వణుకు పుట్టింది. మతపరంగా సున్నితమైన ప్రాంతమని, సమస్యాత్మకమని చెప్పి పాదయాత్రకు అనుమతి రాకుండా చేశారు. నిజానికి భైంసా వెళ్లకుండా సంజయ్‌ని ఆపడమంటే... తాము ఇప్పటికీ భైంసాను శాంతియుత ప్రాంతంగా మార్చలేకపోయామని రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఒప్పుకోవడం గాక మరేంటి? బీజేపీ అధ్యక్షుడు భైంసా వెళ్లకుండా అడ్డుకోవడం కేసీఆర్ ప్రభుత్వం గొప్ప గాదు.... ఆ సమస్యాత్మక ప్రాంతంలోని పరిస్థితులను నేటికీ ఎంతమాత్రం మెరుగుపరచలేకపోయిన తెలంగాణ సర్కారు చేతగానితనం. సంజయ్ భైంసా వెళ్తే... తమ సర్కారు వైఫల్యాలన్నింటినీ మరింతగా బట్టబయలు చేస్తారనే భయంతోనే సర్వశక్తులూ ఒడ్డి ఆగమేఘాల మీద ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు జరిగాయి’’ అని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-11-28T22:57:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising