Rohit Sharma: భారత్‌ను వణికిస్తున్న ఎంగిడి.. నాలుగు కీలక వికెట్లు డౌన్
ABN, First Publish Date - 2022-10-30T17:12:59+05:30
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సూపర్-12 మ్యాచ్‌లో భారత జట్టుకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. సౌతాఫ్రికా బౌలర్ నిప్పులు చెరిగే బంతులకు భారత బౌలర్లకు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు
పెర్త్: టీ20 ప్రపంచకప్ (T20 World Cup)లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సూపర్-12 మ్యాచ్‌లో భారత జట్టు(Team India)కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. సౌతాఫ్రికా(South Africa) బౌలర్ నిప్పులు చెరిగే బంతులకు భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. ఐదో ఓవర్‌లో రోహిత్ శర్మ (15), కేఎల్ రాహుల్(9)లను పెవిలియన్ పంపిన ఎంగిడి.. ఏడో ఓవర్ ఐదో బంతికి కోహ్లీని కూడా అవుట్ చేశాడు. 11 బంతులు ఆడిన కోహ్లీ 2 ఫోర్లతో 12 పరుగులు చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దీపక్ హుడాను నోకియా పెవిలియన్ పంపాడు. దీంతో 42 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది.
మరోవైపు, ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రాహుల్‌ను పక్కన పెట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నా టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మాత్రం రాహుల్‌కు మద్దతుగా నిలిచాడు. అన్నట్టుగానే ఈ మ్యాచ్‌లోనూ రాహుల్‌ను ఓపెనర్‌గా పంపాడు. అయితే, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన రాహుల్ భవితవ్యం ఏమిటనేది తర్వాత జరిగే మ్యాచ్‌తో తేలిపోనుంది. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిశాయి. భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా క్రీజులో ఉన్నారు.
Updated Date - 2022-10-30T17:23:20+05:30 IST