ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistan: పాకిస్థాన్‌ ఫటాఫట్‌

ABN, First Publish Date - 2022-11-10T05:51:09+05:30

రౌండ్‌-12లోనే ఇంటిదారి పడుతుందనుకున్న పాకిస్థాన్‌కు అదృష్టం కలిసొచ్చి ముందంజ వేసింది. ఆ లక్కు ఇచ్చిన కిక్కుతో సెమీఫైనల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అలవోకగా ఫైనల్‌కు జూ రిజ్వాన్‌, బాబర్‌ హాఫ్‌ సెంచరీలు

సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ చిత్తు

టీ20 వరల్డ్‌ కప్‌

కీలకమైన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ కసిదీరా ఆడింది..బౌలర్లు ఎప్పటిలాగానే దుమ్మురేపగా టోర్నీలో ఇప్పటిదాకా విఫలమవుతూ వస్తున్న ఓపెనర్లు మహ్మద్‌ రిజ్వాన్‌, బాబర్‌ ఆజమ్‌ అదరగొట్టారు..హాఫ్‌ సెంచరీలతో అలరించడంతోపాటు తొలి వికెట్‌కు ఏకంగా శతక భాగస్వామ్యం నమోదు చేశారు..దాంతో న్యూజిలాండ్‌తో ఏకపక్ష సెమీఫైనల్లో ఏడు వికెట్లతో నెగ్గిన పాకిస్థాన్‌ సగర్వంగా టైటిల్‌ పోరుకు చేరింది.. మరోవైపు వరల్డ్‌ కప్‌ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను చిత్తు చేసి వావ్‌ అనిపించిన కివీస్‌ ఆపై తడబడుతూ సెమీ్‌సలో అడుగుపెట్టింది.. కానీ అసలైన సమరంలో చేతులెత్తేసి పరాజయం పాలైంది.

సిడ్నీ: రౌండ్‌-12లోనే ఇంటిదారి పడుతుందనుకున్న పాకిస్థాన్‌కు అదృష్టం కలిసొచ్చి ముందంజ వేసింది. ఆ లక్కు ఇచ్చిన కిక్కుతో సెమీఫైనల్లో చెలరేగింది. ఫలితంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో బాబర్‌ ఆజమ్‌ సేన ఏడు వికెట్లతో ఘన విజయం సాధించింది. గురువారం భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య రెండో సెమీ్‌సలో విజేతగా నిలిచే జట్టుతో ఆదివారం జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది. ఇక..ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ 20 ఓవర్లలో 152/4 స్కోరుకే పరిమితమైంది. డారెల్‌ మిచెల్‌ (35 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 53 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీతో ఆదుకున్నాడు. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (46) సత్తాచాటగా, కాన్వే (21) ఫర్వాలేదనిపించాడు. షహీన్‌ షా అఫ్రీది 2 వికెట్లు పడగొట్టాడు. లక్ష్యాన్ని పాకిస్థాన్‌ 19.1 ఓవర్లలో 153/3తో ఛేదించింది. రిజ్వాన్‌ (43 బంతుల్లో 5 ఫోర్లతో 57), బాబర్‌ (42 బంతుల్లో 7 ఫోర్లతో 53) ఆకట్టుకున్నారు. హారిస్‌ (30) చివర్లో మెరుపులు మెరిపించాడు. బౌల్ట్‌ 2 వికెట్లు తీశాడు. రిజ్వాన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

ఓపెనర్ల దూకుడు: ఛేదనలో పాక్‌ ఓపెనర్లు రిజ్వాన్‌, బాబర్‌ ఆజమ్‌ దూకుడే మంత్రంగా ఆడారు. మరోవైపు బౌల్ట్‌ సహా కివీస్‌ బౌలర్లంతా తేలిపోగా, ఫీల్డింగ్‌ వైఫల్యంతో ఆ జట్టు మూల్యం చెల్లించుకుంది. ఆరంభంలో బాబర్‌ ఒకింత తడబాటుకు లోనయ్యాడు. ఎదుర్కొన్న మొదటి బంతికే కివీస్‌ కీపర్‌ వదిలేసిన క్యాచ్‌తో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్న ఆజమ్‌ తనదైన ‘క్లాస్‌’తో బ్యాటింగ్‌ చేశాడు. మరోవైపు ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌నుంచే రిజ్వాన్‌ బ్యాట్‌ ఝళిపించాడు. బౌల్ట్‌ వేసిన మూడో ఓవర్లో బాబర్‌ ఓ ఫోర్‌తో, రిజ్వాన్‌ రెండు బౌండరీలతో కదం తొక్కారు. ఆపై సౌథీ ఓవర్లోనూ ఇద్దరూ ఫోర్ల వర్షం కురిపించడంతో పవర్‌ ప్లేలో పాక్‌ 55/0తో దూసుకుపోయింది. ఇక స్పిన్నర్లు శాంట్నర్‌, సోథి బౌలింగ్‌లో స్వీప్‌షాట్లతో అలరించారు. ఈక్రమంలో తొలుత బాబర్‌, ఆపై రిజ్వాన్‌ అర్ధ శతకాలు పూరించగా..13 ఓవర్లో బాబర్‌ను బౌల్ట్‌ అవుట్‌ చేసినా అప్పటికే పాక్‌ గెలుపు దిశగా వచ్చేసింది. ఆపై హారిస్‌ కూడా ధాటిగా ఆడగా..రిజ్వాన్‌, అనంతరం హారిస్‌ స్వల్ప వ్యవధిలో నిష్క్రమించినా పాక్‌కు ఇబ్బంది లేకపోయింది. అంతకుముందు మందకొడి సిడ్నీ పిచ్‌పై న్యూజిలాండ్‌ బ్యాటర్లు షాట్లు కొట్టేం దుకు ఆపసోపాలు పడ్డారు. మూడో బంతికే ఓపెనర్‌ ఆలెన్‌ (4)ను ఎల్బీ చేసిన అఫ్రీది ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఉన్న కొద్దిసేపూ చక్కటిషాట్లతో అలరించిన కాన్వే, ఫిలిప్‌ (6) అవుటవడంతో జట్టు పూర్తి డిఫెన్స్‌లో పడిపోయింది. కానీ విలియమ్సన్‌, మిచెల్‌, నీషమ్‌ (16 నాటౌట్‌) ఆదుకోవడంతో 150కి పైగా స్కోరు చేసింది.

1992 వన్డే వరల్డ్‌ కప్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ కెప్టెన్సీలో పాకిస్థాన్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్‌, జింబాబ్వే చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించే దుస్థితి ఏర్పడింది. కానీ సెమీ్‌సకు చేరి..అందులో ఫేవరెట్‌ న్యూజిలాండ్‌ ఓడించింది. ఇక ఫైనల్లో ఇంగ్లండ్‌ను చిత్తుచేసి చాంపియన్‌గా నిలిచింది. మరి ఈసారి పాక్‌ ఏం చేస్తుందో?

3 పొట్టి ప్రపంచ కప్‌లో రిజ్వాన్‌, బాబర్‌ తొలి వికెట్‌కు 100కుపైగా రన్స్‌ జోడించడం మూడోసారి. అలాగే మెగా టోర్నీలో పాక్‌ మూడోసారి ఫైనల్‌ చేరింది.

4 వరల్డ్‌ కప్‌ (వన్డేలూ) సెమీస్‌లలో కివీ్‌సపై పాక్‌ నెగ్గడం ఇది నాలుగోసారి.

స్కోరుబోర్డు

న్యూజిలాండ్‌: అలెన్‌ (ఎల్బీ) అఫ్రీది 4, కాన్వే (రనౌట్‌) షాదాబ్‌ 21, విలియమ్సన్‌ (బి) అఫ్రీది 46, ఫిలిప్స్‌ (సి అండ్‌ బి) నవాజ్‌ 6, మిచెల్‌ (నాటౌట్‌) 53, నీషమ్‌ (నాటౌట్‌) 16, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం 20 ఓవర్లలో 152/4; వికెట్ల పతనం: 1-4, 2-38, 3-49, 4-117; బౌలింగ్‌: అఫ్రీది 4-0-24-2, నసీమ్‌ షా 4-0-30-0, రౌఫ్‌ 4-0-32-0, మహ్మద్‌ వసీం 2-0-15-0, షాదాబ్‌ 4-0-33-0, నవాజ్‌ 2-0-12-1.

పాకిస్థాన్‌: రిజ్వాన్‌ (సి) ఫిలిప్స్‌ (బి) బౌల్ట్‌ 57, బాబర్‌ (సి) మిచెల్‌ (బి) బౌల్ట్‌ 53, హారిస్‌ (సి) అలెన్‌ (బి) శాంట్నర్‌ 30, షాన్‌ మసూద్‌ (నాటౌట్‌) 3, ఇఫ్తికార్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 10, మొత్తం 19.1 ఓవర్లలో 153/3; వికెట్ల పతనం: 1-105, 2-132, 3-151; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-33-2, సౌథీ 3.1-0-24-0, ఫెర్గూసన్‌ 4-0-37-0, శాంట్నర్‌ 4-0-26-1, సోధీ 4-0-26-0.

Updated Date - 2022-11-10T05:51:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising