ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KL Rahul: ఇంగ్లండ్ చేతిలో పరాజయంపై కేఎల్ రాహుల్ స్పందన..

ABN, First Publish Date - 2022-11-11T13:52:59+05:30

టీ20 వరల్డ్ కప్-2022 (t20worldcup2022) సెమీస్‌లో ఇంగ్లండ్ (England) చేతిలో టీమిండియా (team India) ఘోర ఓటమిని భారతీయ క్రికెట్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆశలు అడియాశలయ్యాయంటూ నిట్టూర్చుతున్నారు.

KL Rahul
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్-2022 (t20worldcup2022) సెమీస్‌లో ఇంగ్లండ్ (England) చేతిలో టీమిండియా (team India) ఘోర ఓటమిని భారతీయ క్రికెట్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆశలు అడియాశలయ్యాయంటూ నిట్టూర్చుతున్నారు. ఈసారి కప్ ఖాయమనుకుంటే.. సెమీస్‌లో అత్యంత చెత్తగా ఆడి పరువు తీసుకున్నారంటూ ఆటగాళ్లపై మండిపడుతున్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమే కానీ మరీ ఇంత దారుణమా? కనీసం ఒక్క వికెట్ కూడా తీయకపోవడమేంటి?.. ఇలాంటి ఆటగాళ్లతో ప్రపంచ కప్ ఎలా గెలుద్దామనుకున్నారు? అని క్రికెటర్లపై విమర్శల దాడి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ టోర్నీలో దారుణంగా విఫలమైన కేఎల్ రాహుల్ (KL Rahul), రోహిత్ శర్మ (Rohit Sharma), దినేష్ కార్తీక్, రిషబ్ పంత్‌తోపాటు బౌలర్లపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కీలకమైన మ్యాచుల్లో ఘోరంగా ఫెయిలైన కేఎల్ రాహుల్‌పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ‘‘ నువ్వు ఐపీఎల్‌కే (IPL) పరిమితం. ఆరెంజ్ క్యాప్ నీ కోసం ఎదురుచూస్తుంది వెళ్లు. ఇంకెన్నాళ్లు మమ్మల్ని బాధపెడతావ్’’ అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ తీవ్ర విమర్శల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా కేఎల్ రాహుల్ స్పందించాడు.

‘ముక్కలైన హృదయం’ ఎమోజీ సింబ‌ల్‌‌ను ట్వీట్ చేసి తన బాధను తెలియపరిచాడు. మ్యాచ్‌ ఆరంభానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న భారత జట్టు ఫొటోను ట్వీట్‌కు జత చేశాడు. తాను ఎంత బాధకు గురవుతున్నాడో ఈ ట్వీట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశాడు. దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ భిన్నవిధాలు స్పందించారు. కొందరు ఓదార్చే ప్రయత్నం చేయగా.. మరికొందరు చెత్తగా ఆడావంటూ మండిపడ్డారు. ఆటతీరు మార్చుకోవాలంటూ హితబోధ చేశారు. మరికొందరు మీమ్స్‌తో రాహుల్‌ని ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు కేఎల్ రాహుల్ మాదిరిగానే పలువురు కీలక ఆటగాళ్లు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ జాబితాలో స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, డ్యాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నారు.

Updated Date - 2022-11-11T13:57:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising