Harsha Bhogle: బంగ్లాదేశ్ జట్టు ఎదగాలంటే ఏం చేయాలో చెప్పిన హర్షాభోగ్లే
ABN, First Publish Date - 2022-11-03T21:30:44+05:30
బంగ్లాదేశ్ జట్టు ఎదగాలంటే ఏం చేయకూడదో ప్రముఖ కామెంటేటర్ హర్షాభోగ్లే (Harsha Bhogle) చెప్పుకొచ్చాడు
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ జట్టు ఎదగాలంటే ఏం చేయకూడదో ప్రముఖ కామెంటేటర్ హర్షాభోగ్లే (Harsha Bhogle) చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఆ జట్టుకు ఓ చక్కని సలహా ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్(Bangladesh)తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (virat kohli) ఫేక్ ఫీల్డింగ్ చేశాడని, దీంతో తాము 5 పరుగులు కోల్పోయామని బంగ్లాదేశ్ క్రికెటర్ నూరుల్ హసన్ విమర్శలు గుప్పించాడు. సోషల్ మీడియాలో ఇది తీవ్ర చర్చకు దారితీసింది. బంగ్లాదేశ్ అభిమానులు కూడా కోహ్లీపై నోరు పారేసుకున్నారు.
నూరుల్ హసన్ విమర్శలపై ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ఘాటుగా స్పందించాడు. ఓటమికి సాకులు వెతకడం మానేస్తేనే ఎదుగుతారని సలహా ఇచ్చాడు. నిజానికి ఫేక్ ఫీల్డింగ్‌ను ఎవరూ చూడలేదని, బ్యాటర్లు కానీ, ఇటు అంపైర్లు కానీ దానిని గమనించలేదని పేర్కొన్నాడు. ఫేక్ ఫీల్డింగ్‌కు పాల్పడితే నిబంధనల ప్రకారం అంపైర్లు జరిమానా విధిస్తారని అన్నాడు. టాప్ బ్యాటర్లలో చివరి వరకు ఒక్కరు క్రీజులో నిలిచినా బంగ్లాదేశ్ గెలిచేదన్నాడు. సాకులు వెతుక్కుంటూ వెళ్తే ఎదగలేరని హర్ష వరుస ట్వీట్లు చేశాడు.
Updated Date - 2022-11-03T21:33:50+05:30 IST