ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bangladesh vs India: తిప్పేసిన ఉమేశ్, అశ్విన్.. కుప్పకూలిన బంగ్లాదేశ్

ABN, First Publish Date - 2022-12-22T17:16:26+05:30

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ (Ravichandran Ashwin), పేసర్

Team India
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢాకా: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ (Ravichandran Ashwin), పేసర్ ఉమేశ్ యాదవ్(Umesh Yadav) బంతితో చెలరేగిపోయారు. పదునైన బంతుల్లో బంగ్లా (Bangladesh) బ్యాటర్లను బెంబేలెత్తించారు. ఇద్దరూ చెరో నాలుగు వికెట్లు తీసుకుని బంగ్లాదేశ్ పతనంలో కీలక పాత్ర పోషించారు. వారి దెబ్బకు బంగ్లాదేశ్ 227 పరుగులకే కుప్పకూలింది. ఉమేశ్ యాదవ్ 15 ఓవర్లు వేసి 25 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ 21.5 ఓవర్లు వేసి 71 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు.

వీరిద్దరి దెబ్బకు బ్యాటర్లు క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) స్థానంలో జట్టులోకి వచ్చిన ఉనద్కత్ (Unadkat) రెండు వికెట్లు పడగొట్టాడు. సహచరులందరూ క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరుగుతున్నా మోమినుల్ హక్ మాత్రం బౌలర్లను ఎదురొడ్డాడు. 157 బంతులు ఆడిన మోమినుల్ 12 ఫోర్లు, సిక్సర్‌తో 84 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ (Team India) ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (3), శుభమన్ గిల్ (14) పరుగులతో క్రీజులో ఉన్నారు.

Updated Date - 2022-12-22T17:16:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising