ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాయసం తిన్న పిల్లలు కాసేపటికే ఆస్పత్రిలో చేరిక.. చివరగా తల్లి చేసిన పని తెలుసుకుని అంతా షాక్..

ABN, First Publish Date - 2022-04-08T19:05:36+05:30

వివాహేతర సంబంధాలకు అలవాటుపడిన వారు.. చివరికి ఎంతటి దారుణాలకైనా ఒడిగడతారు. తల్లి, తండ్రి, అక్క, తమ్ముడు.. ఆఖరికి సొంత కొడుకులైనా సరే.. తమకు అడ్డు వస్తారని భావిస్తే..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వివాహేతర సంబంధాలకు అలవాటుపడిన వారు.. చివరికి ఎంతటి దారుణాలకైనా ఒడిగడతారు. తల్లి, తండ్రి, అక్క, తమ్ముడు.. ఆఖరికి సొంత కొడుకులైనా సరే.. తమకు అడ్డు వస్తారని భావిస్తే, చంపడానికి కూడా వెనుకాడరు. పచ్చని కాపురాలను నాశనం చేసుకోవడమే కాకుండా.. ముక్కపచ్చలారని పిల్లలను కూడా బలి తీసుకుంటుంటారు. ఇలాంటి హృదయ విదారక ఘటనలు గతంలో ఎన్నో చూశాం. తాజాగా తమిళనాడులో ఇలాంటి ఘటనే జరిగింది. పాయసం తిన్న పిల్లలు కాసేపటికి చూస్తే ఆస్పత్రిలో చేరారు. చివరగా తల్లి చేసిన పని తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే...


చెన్నై పరిధిలోని  కన్యాకుమారి జిల్లా మార్తాండం సమీపం కులకాచి ప్రాంతానికి చెందిన జగదీష్‌, కార్తీక దంపతులు. వీరికి కాంచన (4), కుమారుడు చరణ్‌ (2)  అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. జగదీష్ తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. భర్త, పిల్లలతో ఆనందంగా ఉండాల్సిన కార్తీక.. లేనిపోని సమస్యలను తన జీవితంలోకి ఆహ్వానించింది. భర్తపై చూపించాల్సిన ప్రేమను.. తన బంధువైన సునీల్ అనే యువకుడిపై చూపించింది. కొన్నాళ్లకు వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త లేని సమయాల్లో ప్రియుడిని ఇంటికి పిలిచేది. అయితే ఇంట్లో ఉన్న సమయంలో పిల్లలు అడ్డుగా ఉండడం వారికి నచ్చలేదు. పిల్లలు లేకపోతే ప్రశాంతంగా గడపొచ్చని భావించారు.

8 ఏళ్ల బాలుడు.. ఫోన్లో గేమ్స్ ఆడుతూ చార్జింగ్ ఎలా పెట్టాలో తెలీక ఏకంగా కరెంట్ వైరునే పెట్టేశాడు.. చివరకు..


ఎలాగైనా వారి అడ్డు తొలగించుకోవాలని వివిధ రకాలుగా ఆలోచించారు. బుధవారం వారికి పాయసంలో విషయం కలిపి తినిపించింది. అది తిన్న పిల్లలు ఆడుకుంటూ కాసేపటికే స్పృహ తప్పి పడిపోయారు. గమనించిన బంధువులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పిల్లల్లో చరణ్ మృతి చెందగా.. కాంచన చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరకుని పరిశీలించారు. కార్తీకను అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం అంగీకరించింది. దీంతో గురువారం కార్తీక, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.

వీళ్లేం దంపతులు బాబోయ్.. ఏకంగా 60 కేసులు పెట్టుకున్నారు.. సుప్రీంకోర్టు ఏం తేల్చిందంటే..

Updated Date - 2022-04-08T19:05:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising