8 ఏళ్ల బాలుడు.. ఫోన్లో గేమ్స్ ఆడుతూ చార్జింగ్ ఎలా పెట్టాలో తెలీక ఏకంగా కరెంట్ వైరునే పెట్టేశాడు.. చివరకు..

ABN , First Publish Date - 2022-04-08T18:10:15+05:30 IST

చిన్న పిల్లలు తెలిసీ తెలియక చేసే పనులు.. ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చి పెడుతుంటాయి. కొందరు పిల్లలైతే వింత వింత ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ప్రమాదాలు జరిగి...

8 ఏళ్ల బాలుడు.. ఫోన్లో గేమ్స్ ఆడుతూ చార్జింగ్ ఎలా పెట్టాలో తెలీక ఏకంగా కరెంట్ వైరునే పెట్టేశాడు.. చివరకు..

చిన్న పిల్లలు తెలిసీ తెలియక చేసే పనులు.. ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చి పెడుతుంటాయి. కొందరు పిల్లలైతే వింత వింత ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ప్రమాదాలు జరిగి... ప్రాణాలు పోయిన సందర్భాలు చాలా చూశాం. పిల్లలు ఆడుకునే సమయంలో పెద్దల పర్యవేక్షణ లేని సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 8ఏళ్ల బాలుడు ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉండగా చార్జింగ్ అయిపోయింది. అయితే దానికి చార్జింగ్ ఎలా పెట్టాలో తెలీక ఏకంగా కరెంట్ వైరునే పెట్టేశాడు. ఈ ఘటనతో స్థానికులంతా షాక్‌కు గురయ్యారు..


మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతర్‌పూర్‌ పరిధి నాజర్‌బాగ్ అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇస్త్కార్ ఖాన్ అనే వ్యక్తికి చింటూ ఖాన్ అనే 8ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఖాళీ సమయాల్లో రోజూ ఫోన్‌లో గేమ్ ఆడుకుంటూ ఉండేవాడు. ఈ క్రమంలో ఓ రోజు గేమ్ ఆడుకుంటుండగా.. ఫోన్‌లో చార్జింగ్ అయిపోయింది. అయితే సెల్‌కు చార్జింగ్ ఎలా పెట్టాలో తెలీక.. ఏకంగా కరెంట్ వైరును తీసుకుని పెట్టాడు. డైరెక్ట్‌గా విద్యుత్ సరఫరా కావడంతో బ్యాటరీ పేలిపోయింది. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు గమనించి.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడి కంటికి తీవ్ర గాయమైనట్లు గుర్తించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గ్వాలియర్‌ వైద్య కళాశాలకు తరలించారు. పిల్లలకు ఎలక్ట్రిక్ పరికరాలను దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

 అడవిలోని చిరుత అనూహ్యంగా బావిలో కొట్టుమిట్టాడం చూసి షాకైన జనం.. చివరికి..



Updated Date - 2022-04-08T18:10:15+05:30 IST