వీళ్లేం దంపతులు బాబోయ్.. ఏకంగా 60 కేసులు పెట్టుకున్నారు.. సుప్రీంకోర్టు ఏం తేల్చిందంటే..

ABN , First Publish Date - 2022-04-08T16:32:25+05:30 IST

కలహాలు లేని కాపురం చప్పగా ఉంటుంది.. అన్నట్లుగా దంపతుల మధ్య గొడవలు జరగడం సహజమే. కొందరు భార్యాభర్తలు తమ ప్రేమను కోపం రూపంలో చూపిస్తుంటారు. తాటాకు మంటలా కాసేపటికి..

వీళ్లేం దంపతులు బాబోయ్.. ఏకంగా 60 కేసులు పెట్టుకున్నారు.. సుప్రీంకోర్టు ఏం తేల్చిందంటే..
ప్రతీకాత్మక చిత్రం

కలహాలు లేని కాపురం చప్పగా ఉంటుంది.. అన్నట్లుగా దంపతుల మధ్య గొడవలు జరగడం సహజమే. కొందరు భార్యాభర్తలు తమ ప్రేమను కోపం రూపంలో చూపిస్తుంటారు. తాటాకు మంటలా కాసేపటికి కోపం చల్లారిపోయి మళ్లీ కలిసిపోతుంటారు. ఇదంతా ప్రతి కుటుంబంలో రోజూ జరిగే తంతే.. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే దంపతులు మాత్రం ఇందుకు పూర్తి విరుద్దం. 41సంవత్సరాల వ్యవధిలో ఒకరిపై ఒకరు ఏకంగా 60కేసులు పెట్టుకున్నారు. వీరి వ్యవహారం ఆఖరికి సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. చివరకు కోర్టు ఏం చెప్పిందంటే...


ఓ జంట తమ 30ఏళ్ల వైవాహిక జీవితంలో నిత్యం సమస్యలతో సావాసం చేశారు. ప్రస్తుతం వారు విడిపోయి 11ఏళ్ల అయింది. ఈ మొత్తం 41 సంవత్సరాల కాలంలో ఒకరిపై ఒకరు 60కేసులు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీకోర్టు వరకు వెళ్లింది. ఈ దంపతుల కేసును పరిశీలించిన కోర్టు.. విస్మయం వ్యక్తం చేసింది. ‘‘ఏం చేయాలి.. కొందరికి కొట్లాటలు అంటేనే ఇష్టం.. అలాంటి వారు ఎప్పుడూ కోర్టులోనే ఉండాలని కోరుకుంటారు.. కోర్టును చూడకపోతే వారికి నిద్ర కూడా రాదు’’ అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఆ దంపతులకు యోగా, మెడిటేషన్ వంటివి అవసరమని, అలాగే మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం బుధవారం సూచించింది.

అతడి కాంటాక్ట్ లిస్ట్‌లో 150 మంది మహిళల పేర్లు.. నంబర్ సేకరించి రోజూ చాటింగ్.. చివరకు ఏం జరిగిందంటే..

Updated Date - 2022-04-08T16:32:25+05:30 IST