ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tragic incident: బాల్కనీలో ఆడుకుంటున్న చిన్నారులు.. ఒక్కసారిగా దభేల్‌మని శబ్ధం.. తల్లిదండ్రులు పరుగెత్తుకుంటూ వచ్చి చూడగా...

ABN, First Publish Date - 2022-07-29T22:06:43+05:30

పిల్లల సంరక్షణ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ప్రతిక్షణం వారిని ఓ కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. పిల్లలు (children) ఆడుకునే సమయంలో అనూహ్య ప్రమాదాలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిల్లల సంరక్షణ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ప్రతిక్షణం వారిని ఓ కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. పిల్లలు (children) ఆడుకునే సమయంలో అనూహ్య ప్రమాదాలు చోటు చేసుకోవడం.. ఇటీవల తరచూ చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు తల్లిదండ్రుల (parents) ఏమరపాటు వల్ల పిల్లలు ప్రమాదాలకు గురవుతుంటారు. హర్యానాలో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులు బాల్కనీలో ఆడుకుంటున్నారు. ఆ సమయంలో తల్లిదండ్రులు ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి దభేల్‌మని శబ్ధం వినిపించింది. దీంతో కంగారుగా పరుగెత్తుకుంటూ బయటకు వచ్చారు. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి...


హర్యానా (Haryana) రాష్ట్రం ఓల్డ్ ఫరీదాబాద్ సెక్టార్ 18 అనాజ్ మండి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. యూపీకి చెందిన జితేంద్ర కుమార్.. కొన్నేళ్లుగా ఫరీదాబాద్‌లో ఆటో నడుపుకొంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి  సోను (7) మోను (5) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. జితేంద్ర కుమార్ భార్య ఇంటి వద్దనే ఉంటూ పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటూ ఉంటుంది. ఇదిలావుండగా, సోమవారం ఉదయం తల్లిదండ్రులు ఇంట్లో ఉండగా.. పిల్లలు ఇద్దరూ మూడో అంతస్తులోని బాల్కనీలో ఆడుకుంటూ ఉన్నారు.

Wife Tortured Husband: స్టేషన్‌కు వచ్చిన 73 ఏళ్ల వృద్ధుడు చెప్పింది విని నివ్వెరపోయిన పోలీసులు.. ఏడాది క్రితమే రెండో పెళ్లయిందంటూ..


బాల్కనీ రెయిలింగ్ పట్టుకుని ఆడుకుంటుండగా, ప్రమాదవశాత్తు అది విరిగిపోవడంతో రెండో అంతస్తులో పడిపోయారు. దభేల్‌మని శబ్ధం రావడంతో తల్లిదండ్రులు కంగారుగా పరుగెత్తుకుంటూ బయటికి వచ్చారు. తీవ్ర గాయాలతో కిందపడి ఉన్న కుమారులను చూసి బోరున విలపించారు. స్థానికులు అక్కడికి చేరుకుని పిల్లలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే సోను తలకు బలమైన గాయమవడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మోను పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.

Haryana woman shocking decision: కలిసిపోయిందిలే అనుకున్న కోడలు.. చివరకు ఎంత పని చేసింది.. చెత్త వేసి రమ్మని అత్తకు చెప్పి..



Updated Date - 2022-07-29T22:06:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising