Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 28 Jul 2022 21:31:22 IST

Haryana woman shocking decision: కలిసిపోయిందిలే అనుకున్న కోడలు.. చివరకు ఎంత పని చేసింది.. చెత్త వేసి రమ్మని అత్తకు చెప్పి..

twitter-iconwatsapp-iconfb-icon
Haryana woman shocking decision: కలిసిపోయిందిలే అనుకున్న కోడలు.. చివరకు ఎంత పని చేసింది.. చెత్త వేసి రమ్మని అత్తకు చెప్పి..ప్రతీకాత్మక చిత్రం

కొత్తగా వచ్చిన కోడళ్లకు ఎక్కువగా భర్త, అత్తమామల నుంచి సమస్యలు ఎదురవుతుంటాయి. అదనపు కట్నం పేరుతో కొందరు, వివాహేతర సంబంధాల విషయంలో మరికొందరు చిత్రహింసలకు గురిచేస్తుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటనలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. కొత్తగా వచ్చిన కోడలు అందరితో సరదాగా గడిపేది. కలిసిపోయిందిలే అనుకున్న సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. చెత్త వేసి రమ్మని అత్తకు చెప్పి.. ఆమె చేసిన పని సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే..

హర్యానా (Haryana) రాష్ట్రం అంబాలా పట్టణంలోని న్యూ శివాలిక్ కాలనీకి చెందిన యువకుడికి.. కమెహదీ జిల్లా యమునానగర్ గ్రామానికి చెందిన యువతి (young woman) తో 2021 నవంబర్‌లో వివాహమైంది. అప్పటి నుంచి యువకుడు భార్యతో పాటూ తల్లిదండ్రులతో వద్ద ఉంటున్నాడు. మొన్నటిదాకా ఆమె అందరితో కలివిడిగా ఉంటూ సంతోషంగా ఉండేది. కోడలు అందరితో బాగా కలిసిపోతోందని అత్తమామలు కూడా సంబరపడ్డారు. అయితే ఇటీవల సొంతూరుకు వెళ్లేందుకు పదే పదే సాకులు చెబుతూ ఉండేది. తల్లిదండ్రుల (parents) ను చూడాలనే ఉద్దేశంతో అలా చెబుతోందని అంతా అనుకున్నారు. జూలై 23న భర్త పుట్టిన రోజు (birthday) కావడంతో ఘనంగా నిర్వహిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే అదే రోజు కోడలు అనూహ్య నిర్ణయం తీసుకుంటుందని ఎవరూ ఊహించలేకపోయారు.

Wife Tortured Husband: స్టేషన్‌కు వచ్చిన 73 ఏళ్ల వృద్ధుడు చెప్పింది విని నివ్వెరపోయిన పోలీసులు.. ఏడాది క్రితమే రెండో పెళ్లయిందంటూ..

ఆ రోజు భర్త పని మీద బయటికి వెళ్లాడు. ఇంట్లో అత్త ఒక్కటే ఉండడంతో ఇదే సరైన సమయం అని అనుకుంది. చెత్త తీసుకెళ్లి బయట పడేయమని అత్తకు చెప్పింది. ఆమె తిరిగి ఇంటికి వచ్చి చూస్తే లోపల కనిపించలేదు. ఊర్లో అందరిన విచారించినా ఫలితం లేదు. సమాచారం అందుకున్న భర్త.. కంగారుగా ఇంటికి వచ్చి పరిశీలించాడు. ఇంట్లో రూ.7వేల నగదు, ఆధార్ కార్డు (Aadhaar card) , వివాహ ధృవీకరణ పత్రం (Marriage certificate) , మొబైల్‌ (Mobile) కనిపించలేదు. చివరకు ఆమె సొంతూరులో విచారించినా రాలేదని చెప్పారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు (Missing case) నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

ప్రభుత్వ ఉద్యోగాన్ని వద్దనుకున్నాడు.. ఇప్పుడు అతడికి ప్రతీ రోజూ రూ.2.40 లక్షలు.. అమెరికా, జపాన్ నుంచి కూడా ఆర్డర్లు..!


ఇవి కూడా చదవండిLatest News in Telugu

Viral Video: పాత తరం పనిముట్టే అయినా.. ఎంత పక్కాకా పని చేస్తోందో చూడండి... videoఈ స్కూల్‌కు వెళ్లాలంటే పుస్తకాలతో పాటు.. గొడుగులు కూడా తీసుకెళ్లాల్సిందే..!Viral Video: సముద్రం మీదుగా వెళ్తున్న పైలట్‌‌కు షాకింగ్ అనుభవం.. ఎర్రటి మచ్చలు చూసి షాకవుతున్న నెటిజన్లు.. videoHarassment: అశ్లీల వీడియోలో ఉన్నది నేను కాదంటూ మహిళ మొత్తుకుంటున్నా వినిపించుకోని యువకులు.. చివరకు ఆమె తీసుకున్న నిర్ణయంతో.. Wife planned: భార్య హత్య కేసులో భర్త అరెస్ట్.. నెలన్నర తర్వాత అనుకోకుండా మహిళ ప్రత్యక్షం.. ఇంతకీ ఆమె చేసిన పనేంటంటే..భార్యాభర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆస్పత్రిలో వారు చేసిన నిర్వాకం తెలుసుకుంటే.. వామ్మో అని మీరే అంటారు..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.