ప్రభుత్వ ఉద్యోగాన్ని వద్దనుకున్నాడు.. ఇప్పుడు అతడికి ప్రతీ రోజూ రూ.2.40 లక్షలు.. అమెరికా, జపాన్ నుంచి కూడా ఆర్డర్లు..!

ABN , First Publish Date - 2022-07-28T21:50:05+05:30 IST

లక్షల జీతాలు వచ్చే ఉద్యోగాలకు రాజీనామా చేసి.. సొంతంగా వ్యాపారాలను స్థాపించి కోట్లు సంపాదించేవారిని చాలా మందిని చూశాం. ఇలాంటి వారు ఎన్నుకున్న రంగంలో ఎన్ని..

ప్రభుత్వ ఉద్యోగాన్ని వద్దనుకున్నాడు.. ఇప్పుడు అతడికి ప్రతీ రోజూ రూ.2.40 లక్షలు.. అమెరికా, జపాన్ నుంచి కూడా ఆర్డర్లు..!

లక్షల జీతాలు వచ్చే ఉద్యోగాలకు రాజీనామా చేసి.. సొంతంగా వ్యాపారాలను స్థాపించి కోట్లు సంపాదించేవారిని చాలా మందిని చూశాం. ఇలాంటి వారు ఎన్నుకున్న రంగంలో ఎన్ని ఒడిదుడికులు ఎదురైనా పోరాడి.. చివరకు విజయం సాధిస్తుంటారు. తద్వారా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంటారు. ప్రస్తుతం ఇలాంటి ఓ విజేత గురించి తెలుసుకోబోతున్నాం. ప్రభుత్వ ఉద్యోగాన్ని వద్దనుకున్నాడు. ప్రస్తుతం ఇతను రోజూ రూ.2.40లక్షలకు పైగా సంపాదిస్తున్నాడు. అమెరికా, జపాన్ నుంచి కూడా ఇతడికి ఆర్డర్లు వస్తుంటాయి. ఈయనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్ రాష్ట్రం కోట పరిధి రాంపురలోకి అడుగు పెట్టగానే ఘుమ ఘుమలాడే సువాసన మనకు స్వాగతం పలుకుతుంది. ఇక్కడి 72ఏళ్ల మోహన్ సైనీ గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇంగువతో చేసే కచోరిని స్థానికంగా కోటా రాణి అని, అలాగే కడక్ అనే తిరుతిండిని కోటా రాజు అని పిలుస్తారు. మోహన్ సైనీ చేసే ఈ తిరుతిళ్లకు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎంతో పేరుంది. ఈయన షాపు ముందు ఉదయం 7గంటల నుంచే కస్టమర్లు వేచి చూస్తూ ఉంటారు. బాల్జీ సైనీ అనే వ్యక్తి 120 సంవత్సరాల క్రితం ఈ వ్యాపారాన్ని ప్రారంభించాడు.

రూ.80 లక్షల జీతాన్నిచ్చే జాబ్‌కు గుడ్‌బై.. సొంతూరికి తిరిగొస్తే.. ఇదేం పిచ్చి పని అన్నవాళ్లే ఇప్పుడు అతడి సంపాదన చూసి..


ఈ వ్యాపారాన్ని ఆయన మనువడు మోహన్ సైనీ ప్రస్తుతం కొనసాగిస్తున్నాడు. ఇతడి కుమారులు, మనువళ్లు కూడా చేదోడువాదోడుగా ఉంటారు. తన తాత కాలంలో ఉప్పుతో చేసిన తిరుతిళ్లకు ఎంతో పేరు ఉండేదని మోహన్ సైనీ తెలిపాడు. తర్వాత అన తండ్రి బక్షసైని అదే రుచి, నాణ్యతను అందించాడని గుర్తు చేశాడు. తనకు పోస్టల్ శాఖలో వచ్చిన ప్రభుత్వ ఉద్యోగంలో కూడా చేరలేదన్నారు. 18 ఏళ్ల నుంచి కడక నమ్కీన్ అనే తిరుతిళ్లను తయారు చేస్తున్నాని చెబుతున్నాడు. వర్షాకాలంలో మోహన్ సైనీ తిరుతిళ్లకు చాలా డిమాండ్ ఉంటుందని స్థానికులు తెలిపారు.

రూ.10 నుంచి రూ.500 నోటు వరకు.. ఏ నోటును ముద్రించడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?


మోహన్ సైనీ మాట్లాడుతూ 60 ఏళ్లలో తాను ఎన్నో మార్పులను చూశానని, కానీ కడ్కే నమ్కీన్ అనే తిరుతిళ్ల రుచిని మాత్రం మార్చలేదని చెప్పాడు. 1960లో కడ్కే నమ్‌కీన్ కిలో రూ.1కి అమ్మేవారని తెలిపాడు. ఆ రోజుల్లో ఒక టిన్‌సీడ్ ఆయిల్ ధర రూ.16 ఉండేదని.. ప్రస్తుతం రూ.3,000లు చేరుకుందని చెప్పాడు. దీనికి తగ్గట్టుగా కడ్కే నమ్కీన్‌ను కిలో రూ.240కి విక్రయిస్తున్నట్లు వివరించాడు. గతంలో హ్యాండ్‌కార్ట్‌పై చిరుతిళ్లు అమ్మిన మోహన్ సైనీ.. తర్వాత తాను ఉంటున్న వీధిలో దుకాణాన్ని ప్రారంభించాడు.

ఒకప్పుడు పొలాల్లో పశువుల కాపరి.. ప్రస్తుతం ఈ మహిళ ఏ రేంజ్‌లో ఉందో అస్సలు ఊహించలేరు.. ఒక్కో ఏడాదికి..


బెల్లం నూనెలో వేయించి తయారుచేసే తిరుతిళ్లు జీర్ణక్రియకు మంచిదని, ఇవి తింటే పొట్ట కూడా రాదని మోహన్ సైనీ చెబుతున్నాడు. రోజుకు సుమారుగా 1000కిలోల వరకు విక్రయిస్తున్నట్లు తెలిపాడు. పండుగ సీజన్లలో చాలా డిమాండ్ ఉంటుందని, ప్రస్తుతం అమెరికా, జపాన్ నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయని పేర్కొన్నాడు. ఈ వ్యాపారం వచ్చిన ఆదాయంతోనే కొడుకును డాక్టర్‌ను చేసినట్లు మోహన్ సైనీ తెలిపాడు. ఈయన తిరుతిళ్ల తరహాలోనే నగరంలో చాలా మంది కడకా తయారు చేయడానికి ప్రయత్నించారు. కానీ మోహన్ సైనీ తిరుతిళ్ల రుచిని మాత్రం అందించలేరని స్థానికులు చెబుతున్నారు.

Father Risk for Daughters: కూతుళ్ల కోసమే జైలు నుంచి పారిపోయాడు.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ కూతుళ్ల కోసమే లొంగిపోయిన ఓ తండ్రి కథ..!



Updated Date - 2022-07-28T21:50:05+05:30 IST