రూ.10 నుంచి రూ.500 నోటు వరకు.. ఏ నోటును ముద్రించడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?

ABN , First Publish Date - 2022-06-22T22:25:23+05:30 IST

నిత్యావసరాల కొనుగోలుకు డబ్బును ఖర్చు చేస్తాం. నెలాఖరు వచ్చే సరికి వేటికి ఎంత ఖర్చు పెట్టామని లెక్కలు చూసుకుంటాం. ఇది అందరూ చేసే పనే.. అయితే మనం నిత్యం..

రూ.10 నుంచి రూ.500 నోటు వరకు.. ఏ నోటును ముద్రించడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?

నిత్యావసరాల కొనుగోలుకు డబ్బును ఖర్చు చేస్తాం. నెలాఖరు వచ్చే సరికి వేటికి ఎంత ఖర్చు పెట్టామని లెక్కలు చూసుకుంటాం. ఇది అందరూ చేసే పనే.. అయితే మనం నిత్యం వినియోగించే నోట్ల తయారీకి ఎంత ఖర్చవుతుందనే విషయం ఎప్పుడైనా ఆలోచించారా..? సమాచార హక్కు చట్ట కింద అడిగిన ఓ ప్రశ్నకు రిజర్వ్ బ్యాంక్ వివరాలు తెలియజేసింది. రోజురోజుకూ పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా నోట్ల ముద్రణకు కూడా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోందని RBI పేర్కొంది. 500 రూపాయల నోట్ల కంటే 200 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్ల కంటే 10రూపాయల నోట్ల ముద్రణకు ఎక్కువ ఖర్చు అవుతోందని చెబుతోంది. ఏఏ నోట్ల ముద్రణకు ఎంత ఖర్చు అవుతోందనే వివరాల్లోకి వెళితే..


ప్రస్తుతం వెయ్యి రూ.10 నోట్లను ముద్రించేందుకు రూ.960 ఖర్చవుతుండగా.. అదే వెయ్యి రూ.20 నోట్ల ముద్రణకు రూ.950 మాత్రమే ఖర్చవుతోంది. తద్వారా రూ20నోట్ల కంటే రూ.10 నోట్ల ముద్రణకే ఎక్కువ ఖర్చు అవుతోంది. అదే విధంగా వెయ్యి రూ.500 నోట్ల ముద్రణకు రూ.2,290 వెచ్చించాల్సి ఉండగా, అదే వెయ్యి రూ.200 నోట్లను ముద్రించేందుకు మొత్తం రూ.2,370 ఖర్చవుతోంది. అలాగే వెయ్యి రూ.100 నోట్లను ముద్రించడానికి రూ.1,770 ఖర్చు చేస్తున్నారు.

Currency నోట్లను తయారు చేయడానికి దేన్ని ఉపయోగిస్తారో తెలుసా..? పేపర్ అస్సలు కాదండోయ్..!


ఏడాది వ్యవధిలో నోట్ల ముద్రణ వ్యయం పెరగడం వల్ల ఆ ప్రభావం రూ.50 నోట్ల ముద్రణపై పడింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వెయ్యి రూ.50 నోట్ల ముద్రణ వ్యయం రూ.920 కాగా, 2021-22లో అది 23 శాతం పెరిగి రూ.1,130కి చేరుకుందని ఆర్‌బీఐ తెలిపింది. రూ.20 నోట్ల ముద్రణపై అతి తక్కువ ప్రభావం పడింది. 2020-21లో వెయ్యి రూ.20 నోట్ల ముద్రణకు రూ.940 ఖర్చు చేయగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.950 ఖర్చు చేశారు. అయితే రూ.500 నోట్ల ముద్రణ వ్యయంలో ఎలాంటి మార్పు లేదని ఆర్‌బీఐ పేర్కొంది.

ఒకే ఒక్క పొటాటో చిప్ పీస్ ధర ఏకంగా రూ.1.63 లక్షలు.. ఇంత ఖరీదేంటని ఆశ్చర్యపోతున్నారా..?


రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం కలిసి దేశంలో నాలుగు ప్రాంతాల్లో నోట్లను ముద్రిస్తాయి. ఇందులో రెండు ప్రెస్‌లు ఆర్‌బీఐ పరిధిలో ఉండగా, మరో రెండు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. మైసూర్, సల్బోనిలో ఉన్న ముద్రణ కేంద్రాలు.. ఆర్‌బీఐ పరిధిలో ఉండగా, నాసిక్, దేవాస్‌లో ఉన్న ముద్రణ కేంద్రాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నాయి. అయితే నాణేలను ముద్రించే హక్కు మాత్రం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. దేశంలో ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, నోయిడాలో నాణేలను ముద్రిస్తున్నారు. నోట్ల తయారీకి వినియోగించే.. కలర్ షిఫ్ట్ ఇంటాగ్లియో ఇంక్ (CSII)ను గతంలో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు. అయితే ప్రస్తుతం దీన్ని మైసూరులోనే తయారు చేస్తున్నారు. దీంతో దిగుమతి వ్యయం తగ్గడంతో పాటూ విదేశీ మారకద్రవ్యం కూడా ఆదా అవుతోందని RBI నివేదికలో పేర్కొంది. 


Updated Date - 2022-06-22T22:25:23+05:30 IST