Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 26 Jul 2022 16:05:43 IST

Father Risk for Daughters: కూతుళ్ల కోసమే జైలు నుంచి పారిపోయాడు.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ కూతుళ్ల కోసమే లొంగిపోయిన ఓ తండ్రి కథ..!

twitter-iconwatsapp-iconfb-icon
Father Risk for Daughters: కూతుళ్ల కోసమే జైలు నుంచి పారిపోయాడు.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ కూతుళ్ల కోసమే లొంగిపోయిన ఓ తండ్రి కథ..!

పుట్టబోయేది కూతురు అని తెలిస్తే.. అబార్షన్ చేయించే రోజులివి. కొందరైతే.. కూతురు (Daughter) పుడితే తెగ బాధపడిపోతుంటారు. ప్రేమ చూపించకపోగా జీవితాంతం అసహ్యించుకుంటూనే ఉంటారు. ఇలాంటి తండ్రులు ఉన్న ఈ కాలంలో కూతుళ్లను కంటికి రెప్పలా కాపాడుకునే తండ్రులు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి.. ఈ కోవకే చెందుతాడు. కూతుళ్ల సంక్షేమం కోసం జైలు (prison) నుంచి పారిపోయాడు. 12ఏళ్ల తర్వాత మళ్లీ కూతుళ్ల కోసమే లొంగిపోయాడు. మహారాష్ట్ర (Maharashtra) లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన సంజయ్ తేజన్‌ అనే వ్యక్తిని.. 2003లో ఓ హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ అనంతరం 2005లో సంజయ్‌తో పాటూ అతడి తండ్రి శాలిరామ్, సోదరులు వాసుదేవ్, నామ్‌దేవ్‌లకు కోర్టు (Court) జీవిత ఖైదు విధించింది. ఈ క్రమంలో సంజయ్.. ‌రెండు సార్లు పెరోల్‌పై ఇంటికి వచ్చాడు. 2007లో సంజయ్ దంపతులకు శ్రద్ధ, శృతి అనే ఇద్దరు కవల కుమార్తెలు జన్మించారు. దీంతో తన కుమార్తెల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని శిక్షను రద్దు చేయాలని సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అతడి విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. అప్పటి నుంచి రోజూ కూతుళ్ల కోసమే ఆలోచించేవాడు. చివరకు సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

Shocking decision: మీ కూతురు ఎక్కడ అని అడిగితే.. గండె పోటుతో చనిపోయిందని చెప్పండి.. అని లేఖ రాసి.. 15 ఏళ్ల బాలిక చేసిన పని..

తన కూతుళ్లను బాగా చదివించాలనే ఉద్దేశంతో 12ఏళ్ల క్రితం జైలు నుంచి పరారయ్యాడు. కుటుంబానికి దూరంగా ఉంటూనే తరచూ కుటుంబ సభ్యులను కలుస్తూ ఉండేవాడు. పోలీసులు అతడి ఆచూకీ కోసం ఎంత గాలించినా పట్టుకోలేకపోయారు. ఎవరికీ తెలియకుండా బయటి ప్రాంతాల్లో ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేస్తూ.. మరోవైపు పిల్లల సంక్షేమాన్ని కూడా చూసుకునేవాడు. తను ఎక్కడున్నాడనే విషయం ఎవరికీ తెలియకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకునేవాడు. ప్రస్తుతం సంజయ్ కుమార్తెలు పదో తరగతి (10th class) చదువుతున్నారు. ఈ  ఏడాది మేలో పదో తరగతి పరీక్ష ఫలితాలు వచ్చాయి. సంజయ్ కూతుళ్లిద్దరూ 86, 83 శాతం మార్కులతో పాస్ అయ్యారు. దీంతో సంజయ్.. సంతోషంతో ఉప్పొంగిపోయాడు. ఇక తన కూతుళ్ల భవిష్యత్‌కు ఎలాంటి ఢోకా ఉండదనుకున్నాడు.

Bank cash: యువతిని మాటల్లోకి దింపిన యువకుడు.. తిరిగి ఇంటికి వస్తుండగా పాస్‌బుక్ తెరచి చూసిన ఆమెకు..

పరారీలోనే ఉంటే తన కుటుంబానికి ఎక్కడ సమస్యలు ఎదురవుతాయో అని ఆలోచించి.. ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో అతన్ని నాగ్‌పూర్‌లోని సెంట్రల్ జైలుకు తరలించారు. జైలు నుంచి పారిపోవడం వల్ల సెలవులు తదితర ఇతర సౌకర్యాలు తనకు అందకుండా పోతాయని తెలుసని, కానీ కూతుళ్ల సంక్షేమం కోసమే ఇలా చేశానని సంజయ్ తెలిపాడు. ఇదిలావుండగా, పదో తరగతిలో మంచి మార్కులు సాధించినందుకు నాగ్‌పూర్ సెంట్రల్ జైలులోని జైల్ డిపార్ట్‌మెంట్ అలాగే ఎన్జీవోలు సంజయ్ కూతుళ్లను గురువారం సత్కరించారు. కుమార్తెల సంక్షేమం కోసం సంజయ్ చేసిన త్యాగం తెలుసుకుని అంతా అతన్ని అభినందిస్తున్నారు.

woman bus driver: అంత అందగత్తె.. ఇంత గొప్ప బస్ డ్రైవర్.. మొత్తానికి రాష్ట్రంలోనే రికార్డు సృష్టించిందిగా..


ఇవి కూడా చదవండిLatest News in Telugu

పచ్చ చొక్కా అంకుల్ అంటూ.. ఏడుస్తూ టీచర్ దగ్గరకు వెళ్లి జరిగిన దారుణాన్ని చెప్పిన 8 ఏళ్ల బాలిక.. చివరకు..1433 Kilometers ప్రయాణించి భర్తను చేరుకున్న మహిళ.. ఇంటి ఎదుట ఏడు రోజులుగా కేవలం నీళ్లు తాగుతూ.. చివరకు రిక్షా డ్రైవర్ గమనించడంతో..చనిపోయిందా..? చంపేశారా..? మిస్టరీగా మారిన మహిళ సజీవ దహనం కేసు.. తెల్లవారుజామున 3 గంటల సమయంలో..నేరుగా స్టేషన్‌కు వచ్చి.. వెక్కి వెక్కి ఏడుస్తూ 15 ఏళ్ల బాలిక చెప్పింది విని నివ్వెరపోయిన పోలీసులు.. ఇంటికి వెళ్లి చూస్తే..Viral Video: పెళ్లిలో ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్‌ను ఓపెన్ చేసి చూసి.. సిగ్గుతో ఎవరికీ కనిపించకుండా దాచిన వరుడు.. వధువు రియాక్షన్ చూస్తే..videoఒక్క రోజు సెలవు ఇవ్వలేదనే కారణంతో.. లక్షల జీతం వచ్చే ఉద్యోగానికి రాజీనామా చేసిన మహిళ.. ఇంతకీ ఆమె సమస్య ఏంటంటే..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.