Shocking decision: మీ కూతురు ఎక్కడ అని అడిగితే.. గండె పోటుతో చనిపోయిందని చెప్పండి.. అని లేఖ రాసి.. 15 ఏళ్ల బాలిక చేసిన పని..

ABN , First Publish Date - 2022-07-25T02:20:56+05:30 IST

కొందరు బాలికలు (girls), యువతులు (young women) .. చిన్న చిన్న సమస్యలకే డిప్రెషన్‌ (Depression) లోకి వెళ్లిపోతుంటారు. ఇంట్లో వారు మందలించినా, తోటి స్నేహితులు..

Shocking decision: మీ కూతురు ఎక్కడ అని అడిగితే.. గండె పోటుతో చనిపోయిందని చెప్పండి.. అని లేఖ రాసి.. 15 ఏళ్ల బాలిక చేసిన పని..

కొందరు బాలికలు (girls), యువతులు (young women) .. చిన్న చిన్న సమస్యలకే డిప్రెషన్‌ (Depression) లోకి వెళ్లిపోతుంటారు. ఇంట్లో వారు మందలించినా, తోటి స్నేహితులు అవమానించినా, పరీక్షల్లో ఫెయిల్ అయినా, ప్రేమ (love) వ్యవహారాల్లో మోసం జరిగినా.. ఇలా వివిధ సమస్యలకు తీవ్రంగా కుంగిపోతుంటారు. కొందరైతే చివరకు అనూహ్య నిర్ణయాలు తీసుకుని.. కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగుల్చుతుంటారు. బీహార్‌లో ఓ బాలిక చేసిన పనికి.. ఆమె కుటుంబ సభ్యులు ప్రస్తుతం తల్లడిల్లిపోతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


బీహార్ (Bihar) రాష్ట్రం ముజఫర్‌పూర్‌ పరిధి భగవాన్‌పూర్‌లోని గణేష్‌దత్ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న చంద్రమణి లాలన్ అనే వ్యక్తికి భార్య, కూతురు శ్రేయ కుమారి అలియాస్ ఖుషి (15) ఉన్నారు. లాలన్ హార్డ్‌వేర్ (Hardware) దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతడి కుమార్తె శ్రేయ.. ఇటీవలే మెట్రిక్యులేషన్‌ పరీక్షలు (Matriculation exams) రాసింది. 90% మార్కులు వస్తాయని ఆమెతో పాటూ కుటుంబ సభ్యులు కూడా నమ్మకంతో ఉండేవారు. నాలుగు రోజులు క్రితం శ్రేయ తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో శుక్రవారం పరీక్ష ఫలితాలు వచ్చాయి. కానీ శ్రియకు 59% మార్కులు మాత్రమే వచ్చాయి. దీంతో ఆమె తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లింది. శనివారం రాత్రి భోజనం చేసి పడుకుంది. అయితే ఆదివారం చూడగా కనిపించలేదు. గది మొత్తం వెతకగా మంచంపై ఓ లెటర్ కనిపించింది. 

Bank cash: యువతిని మాటల్లోకి దింపిన యువకుడు.. తిరిగి ఇంటికి వస్తుండగా పాస్‌బుక్ తెరచి చూసిన ఆమెకు..


ఆ లెటర్‌లో ‘‘ అమ్మా,నాన్నా.. నన్ను క్షమించండి. నాకు బతకాలని లేదు.. అందుకే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్తున్నాను. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. వచ్చే జన్మలో మిమ్మల్ని మళ్లీ కలుస్తా అనే నమ్మకం ఉంది.. గంగానదిలో మునిగి చనిపోవాలని అనుకుంటున్నా. నా మృతదేహం కోసం వెతకొద్దు. ఎవరైనా అడిగితే.. మా కూతురు గుండెపోటు (Heart attack) తో చనిపోయింది అని చెప్పండి. ఇప్పటి నుంచి మీకు ఒక కూతురు ఉందన్న విషయం కూడా మర్చిపోండి’’.. అని రాసి ఉంది. ఈ లేఖ చూడగానే బాలిక కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఇంత చిన్న సమస్యకు ఎంత పని చేశావమ్మా... నువ్వు లేకుంటూ మేమెలా బతకాలి.. అంటూ విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గంగానదిలో మొత్తం వెతికినా బాలిక మృతదేహం కనిపించలేదు. ప్రస్తుతం ఆమె కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.

పచ్చ చొక్కా అంకుల్ అంటూ.. ఏడుస్తూ టీచర్ దగ్గరకు వెళ్లి జరిగిన దారుణాన్ని చెప్పిన 8 ఏళ్ల బాలిక.. చివరకు..



Updated Date - 2022-07-25T02:20:56+05:30 IST