Bank cash: యువతిని మాటల్లోకి దింపిన యువకుడు.. తిరిగి ఇంటికి వస్తుండగా పాస్‌బుక్ తెరచి చూసిన ఆమెకు..

ABN , First Publish Date - 2022-07-25T00:11:57+05:30 IST

ఏమాత్రం ఆదమరచినా ఎప్పుడెప్పుడు మోసం చేద్దామా.. అని నేరగాళ్లు పొంచి ఉంటారు. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా సర్వం దోచేస్తారు. ఇటీవల ఎక్కడ చూసినా ఇలాంటి నేరాలే..

Bank cash: యువతిని మాటల్లోకి దింపిన యువకుడు.. తిరిగి ఇంటికి వస్తుండగా పాస్‌బుక్ తెరచి చూసిన ఆమెకు..
ప్రతీకాత్మక చిత్రం

ఏమాత్రం ఆదమరచినా ఎప్పుడెప్పుడు మోసం చేద్దామా.. అని నేరగాళ్లు పొంచి ఉంటారు. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా సర్వం దోచేస్తారు. ఇటీవల ఎక్కడ చూసినా ఇలాంటి నేరాలే జరుగుతున్నాయి. కొందరు ఆన్‌లైన్ వేదికగా మోసాలకు పాల్పడుతుంటే.. మరికొందరు బ్యాంకులు, ఏటీఎంల వద్ద మాయమాటలు చెబుతూ మోసాలు చేస్తుంటారు. హర్యానా (Haryana) లో ఇలాంటి ఓ కేసు ఇటీవల వెలుగులోకి వచ్చింది. బ్యాంకులో ఉన్న యువతిని ఓ యువకుడు మాటల్లోకి దింపాడు. తర్వాత ఆమె ఇంటికి వెళుతూ బ్యాంక్ పాస్‌బుక్ (Bank pass book) చూసుకుని ఒక్కసారిగా షాక్ అయింది. అసలు ఏం జరిగిందంటే..


హర్యానా రాష్ట్రం పానిపట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక మోడల్ టౌన్‌లో ఉంటున్న ఓ యువతి ఇటీవల స్థానిక బ్యాంక్‌కు వెళ్లింది. అక్కడ ఓ యువకుడు ఆమెకు పరిచయం అయ్యాడు. బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేస్తూ.. ఆమె చెక్‌బుక్‌ను తీసుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అనంతరం యువతి బ్యాంకు పాస్‌బుక్‌లో నగదు లావాదేవీలను అప్‌డేట్ చేయించుకుని, ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యలో ఓ సారి బుక్ తెరచి చూసింది. అందులో గంట క్రితమే రూ.50,000లు విత్‌డ్రా చేసినట్లుగా నమోదై ఉంది.

woman bus driver: అంత అందగత్తె.. ఇంత గొప్ప బస్ డ్రైవర్.. మొత్తానికి రాష్ట్రంలోనే రికార్డు సృష్టించిందిగా..


దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. వెంటనే మళ్లీ బ్యాంక్‌కు వెళ్లి.. అధికారులకు ఫిర్యాదు చేసింది. తర్వాత అధికారులు విచారించగా.. కొత్త వ్యక్తి నగదును విత్‌డ్రా చేసినట్లు తెలిసింది. దీంతో ఆమెకు అసలు విషయం గుర్తుకువచ్చింది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన మోసంపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. అపరిచిత వ్యక్తులను నమ్మి.. ఎలాంటి వివరాలను తెలియజేయవద్దని అధికారులు సూచించారు.

పచ్చ చొక్కా అంకుల్ అంటూ.. ఏడుస్తూ టీచర్ దగ్గరకు వెళ్లి జరిగిన దారుణాన్ని చెప్పిన 8 ఏళ్ల బాలిక.. చివరకు..



Updated Date - 2022-07-25T00:11:57+05:30 IST