రూ.80 లక్షల జీతాన్నిచ్చే జాబ్‌కు గుడ్‌బై.. సొంతూరికి తిరిగొస్తే.. ఇదేం పిచ్చి పని అన్నవాళ్లే ఇప్పుడు అతడి సంపాదన చూసి..

ABN , First Publish Date - 2022-06-25T22:20:07+05:30 IST

ప్రస్తుత యువత చదువు పూర్తవగానే ఉద్యోగ వేట ప్రారంభిస్తుంటారు. కొందరు లక్షల ప్యాకేజీతో విదేశాల్లో ఉద్యోగం చేస్తుంటారు. జీవితాంతం అదే వృత్తిగా జీవిస్తుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం.. ఇందుకు...

రూ.80 లక్షల జీతాన్నిచ్చే జాబ్‌కు గుడ్‌బై.. సొంతూరికి తిరిగొస్తే.. ఇదేం పిచ్చి పని అన్నవాళ్లే ఇప్పుడు అతడి సంపాదన చూసి..

ప్రస్తుత యువత చదువు పూర్తవగానే ఉద్యోగ వేట ప్రారంభిస్తుంటారు. కొందరు లక్షల ప్యాకేజీతో విదేశాల్లో ఉద్యోగం చేస్తుంటారు. జీవితాంతం అదే వృత్తిగా జీవిస్తుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం.. ఇందుకు పూర్తి విరుద్ధం. అమెరికాలో రూ.80లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. ఈ స్థానంలో వేరెవరు ఉన్నా.. అక్కడే స్థిరపడిపోతారు. కానీ ఇతడు మాత్రం అలా చేయలేదు. సొంతూరికి వెళ్లి సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఊర్లో అంతా పిచ్చివాడు అని అన్నారు. కానీ ప్రస్తుతం అతను కోట్లు సంపాదించడంతో పాటూ సుమారు 80మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ పరిధి బుబుక్‌పూర్ గ్రామానికి చెందిన రైతు సునీల్ చౌదరికి తుషార్ అనే కుమారుడు ఉన్నాడు. ఇతను పాఠశాల విద్య తర్వాత దేశంలోని అత్యున్నత కళాశాల అయిన మహారాష్ట్రలోని పూణేలో ఉన్న సింబయాసిస్‌లో MBA చేశాడు. అనంతరం క్యాంపస్ సెలక్షన్ ద్వారా రూ.80 లక్షల ప్యాకేజీతో అమెరికాలో మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. అయితే అతనికి ఉద్యోగం చేయడం ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. సేంద్రియ వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఉద్యోగానికి గుడ్‌బై చెప్పేసి, సొంతూరికి వచ్చాడు. మంచి ఉద్యోగాన్ని వదిలి ఇంటికి వచ్చిన తుషార్‌ను.. మొదట్లో అంతా పిచ్చివాడిగా చూశారు. చాలా మంది హేళనగా మాట్లాడారు. అయినా అతను అవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేయడం ప్రారంభించాడు.

ఈ భార్యాభర్తలిద్దరూ ఐఐటీ టాపర్స్.. America లో కోట్లలో ప్యాకేజీతో జాబ్స్‌కు రాజీనామా చేసి సొంతూరికి తిరిగొచ్చి..


ఏడాది పొడవునా పాలీ హౌస్ ఫార్మింగ్‌ చేయడంపై... లక్నో, మీరట్, ఢిల్లీలోని వ్యవసాయ నిపుణులను సంప్రదించాడు. వారి సలహాలు తీసుకుని పాలీ హౌస్ ఫార్మింగ్‌‌ను ప్రారంభించాడు. తుషార్‌కు నేటికీ నాలుగు ఎకరాల భూమి ఉంది. అందులో పాలీ హౌస్ పద్ధతిలో దోసకాయలు మాత్రమే సాగు చేస్తున్నారు. కొన్నిసార్లు క్యాప్సికం కూడా పండిస్తారు. కలుపు తీయడం, కోతలు, పంట సంరక్షణ, ప్యాకింగ్‌, లోడింగ్‌ తదిర పనులకు నిత్యం సుమారు 80 మంది వరకు పని చేస్తుంటారు. ఏడాది పొడవునా వారికి ఉపాధి కల్పిస్తున్నాడు. సాంకేతికతతో పండించిన ఖీరదోస నేరుగా ఆజాద్‌పూర్, ఢిల్లీలోని ఘాజీపూర్, యూపీ తదితర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. కొన్ని ఆహార సంస్థలు, హోటల్ యజమానులు నేరుగా ఇక్కడి వచ్చి కొనుగోలు చేస్తుంటారు.

సివిల్ ఇంజనీర్‌ జాబ్‌కు గుడ్‌బై.. ఇప్పుడు రోజుకు 6 వేల సంపాదన.. ఇంతకీ ఇతడు చేస్తున్న పనేంటంటే..


గ్రో పాలీ హౌస్ పద్ధతిలో దోసకాయలు పండించడం ద్వారా లాభాలు ఆర్జించవచ్చని తుషార్ చెబుతున్నారు. పాలీ హౌస్‌లో 10 వేల దోస విత్తనాలు నాటినట్లు చెప్పాడు. ఒక మొక్క 5 కిలోల వరకు దిగుబడి ఇస్తుందన్నాడు. ఈ లెక్కన ఎకరాకు సుమారు 2 లక్షల దోసకాయల దిగుబడి వస్తుందని తెలిపాడు. తుషార్ ప్రస్తుతం 4 ఎకరాల్లో 8 లక్షలకు పైగా దోసకాయలు పండిస్తున్నాడు. హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో దోసకాయ రూ.20 నుంచి రూ.25 పలుకుతోంది. తుషార్‌కు పంటలో ఒకేసారి 40 లక్షలకు పైగా టర్నోవర్ వస్తోంది. 2018 నుంచి ఈ సాగు చేస్తున్నాడు. మొదట్లో పాలీ హౌస్ పద్ధతిలో ఎకరంలో దోసకాయ సాగు చేశాడు. అందులో 25 శాతం వరకు లాభం రావడంతో రెండేళ్ల తర్వాత మొత్తం 4 ఎకరాల్లో సాగు చేపట్టాడు. ఇందులో ఏటా 40 లక్షలకు పైగా లాభం వస్తోందని తుషార్ తెలిపాడు. పొలంలో ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి ఎగ్జాస్ట్, కూలర్ ఏర్పాటు చేశాడు. అలాగే నిత్యం తేమ ఉండేలా స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశాడు. వేసవి, వర్షాకాలాల్లో పంట దెబ్బతినకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడు. వచ్చే ఏడాదిలో సేంద్రియ పద్ధతిలో 10 ఎకరాల్లో పాలీ హౌస్‌ వ్యవసాయం చేయనున్నట్లు తుషార్ చెబుతున్నాడు.

డబ్బుల్లేక ఇంటర్‌తోనే చదువుకు పులుస్టాప్.. ఇప్పుడు ఏడాదికి రూ.2 కోట్ల ఆదాయం.. ఈ కుర్రాడు చేసే పనేంటంటే..


చిన్నప్పటి నుంచి గ్రామంలోనే పెరిగినందున పట్టణ వాతావరణం అనుకూలించలేదని, నిత్యం ఊరు పొలాల గురించే ఆలోచించేవాడినని తుషార్ చెబుతున్నాడు. చిన్నప్పటి నుంచి తండ్రితో పాటు వ్యవసాయ పనులకు వెళ్లేవాడినని, అందుకే వ్యవసాయం మీద ఆసక్తి పెరిగిందన్నాడు. తను చిన్నగా ఉన్నప్పుడు తన తండ్రి.. పప్పులు, చెరకును సంప్రదాయ పద్ధతిలో పండించేవారని చెప్పాడు. దీంతో ఆ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం తుషార్.. మయాంక్, రాబిన్‌ అనే విత్రులతో పాటూ మరో ఇద్దరు భాగస్వాములను చేర్చుకున్నాడు. సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలకు విదేశీ మార్కెట్‌తో పాటు మన దేశంలోని మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని తెలిపాడు. త్వరలో వ్యవసాయాన్ని మరింత విస్తరించి, టమాటా, పూలు, క్యాబేజీ తదితర పంటల సాగు చేపట్టనున్నట్లు తుషార్ చెబుతున్నాడు. 

ఆవులు, గేదెలు లేకుండా పాల వ్యాపారమేంటని అంతా నవ్వారు.. కానీ ఇప్పుడు లక్షల సంపాదన..!

Updated Date - 2022-06-25T22:20:07+05:30 IST