Wife Tortured Husband: స్టేషన్‌కు వచ్చిన 73 ఏళ్ల వృద్ధుడు చెప్పింది విని నివ్వెరపోయిన పోలీసులు.. ఏడాది క్రితమే రెండో పెళ్లయిందంటూ..

ABN , First Publish Date - 2022-07-28T23:08:33+05:30 IST

భార్య, పిల్లలు ఉన్నా.. చాలా మంది వృద్ధాప్యంలో ఆదరణ లేక అవస్థలు పడుతుంటారు. కొందరైతే కోట్ల ఆస్తి ఉన్నా.. కనీసం తిండి పెట్టేవారు లేక ఇబ్బందులు పడుతుంటారు. రాజస్థాన్‌లో 73 ఏళ్ల...

Wife Tortured Husband: స్టేషన్‌కు వచ్చిన 73 ఏళ్ల వృద్ధుడు చెప్పింది విని నివ్వెరపోయిన పోలీసులు.. ఏడాది క్రితమే రెండో పెళ్లయిందంటూ..
ప్రతీకాత్మక చిత్రం

భార్య, పిల్లలు ఉన్నా.. చాలా మంది వృద్ధాప్యంలో ఆదరణ లేక అవస్థలు పడుతుంటారు. కొందరైతే కోట్ల ఆస్తి ఉన్నా.. కనీసం తిండి పెట్టేవారు లేక ఇబ్బందులు పడుతుంటారు. రాజస్థాన్‌లో 73 ఏళ్ల వృద్ధుడికి కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. భార్య, ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు ఉన్నా కూడా అతడికి సమస్యలు మాత్రం తప్పడం లేదు. దీంతో చివరకు పోలీసులను ఆశ్రయించాడు. ఏడాది క్రితమే రెండో పెళ్లి అయిందంటూ.. అతడు చెప్పింది విని పోలీసులు కూడా నివ్వెరపోయారు. వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రం జైపూర్ (Jaipur) పరిధి బర్కత్ నగర్‌కు చెందిన రామ్ ధన్ బైర్వా అనే వృద్ధుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో ఒకరు  ఢిల్లీలో రైల్వే ఉద్యోగం (Railway job) చేస్తుండగా, మరొకరు అమెరికా (America) లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడి భార్య సరోజ అనారోగ్యంతో 2021 జూన్‌లో మరణించింది. వృద్ధాప్యంలో తోడుగా ఉంటుందనే ఉద్దేశంతో.. 2021 డిసెంబర్‌లో 62 ఏళ్ల సుమన్ కౌశల్‌ను ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నాడు. అయితే రెండో వివాహంతో అతడికి సమస్యలు మొదలయ్యాయి. కొన్నాళ్లు బాగా చూసుకున్న సుమన్ కౌశల్.. రాను రాను భర్తను వేధించడం మొదలెట్టింది. నిత్యం డబ్బుల కోసం అతడిపై ఒత్తిడి తెస్తూ ఉండేది. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్‌లో ఇంట్లోని అల్మారా నుంచి భర్తకు తెలీకుండా  రూ.1.25 లక్షలు తీసుకుంది. అంతటితో ఆగకుండా బంగారు ఆభరణాలు (Gold ornaments) కూడా తన ఆధీనంలో ఉంచుకుంది.

ప్రభుత్వ ఉద్యోగాన్ని వద్దనుకున్నాడు.. ఇప్పుడు అతడికి ప్రతీ రోజూ రూ.2.40 లక్షలు.. అమెరికా, జపాన్ నుంచి కూడా ఆర్డర్లు..!


రామ్ ధన్ బైర్వాను చూసుకోక పోగా.. రోజు రోజుకూ దూరం పెట్టింది. కొన్ని నెలలకు విడిగా లక్షల ఖర్చు చేసి కొత్త ఇల్లు కట్టించుకుని, అందులో ఒక్కటే నివాసం ఉండేది. కొడుకు, కోడలు, మనువళ్లతో మాట్లాడకుండా కట్టడి చేసింది. వృద్ధుడి పేరు మీద ఉన్న భూములను తన పేరు మీద రాయించాలని రోజూ చిత్రహింసలకు గురి చేసేంది. అయినా రామ్ ధన్ బైర్వా అందుకు ఒప్పుకోకపోవడంతో పాలల్లో విషం ఇచ్చి చంపుతా అంటూ బెదిరించింది. దీంతో చివరకు ఈ ఏడాది మేలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే వారు కూడా ఎలాంటి సాయం చేయలేదు. తనకు న్యాయం చేయాలంటూ ఈనెల 20న డీసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. అయినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఎట్టకేలకు కోర్టు ఆదేశాలతో బుధవారం సుమన్ కౌశల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Harassment: అశ్లీల వీడియోలో ఉన్నది నేను కాదంటూ మహిళ మొత్తుకుంటున్నా వినిపించుకోని యువకులు.. చివరకు ఆమె తీసుకున్న నిర్ణయంతో..



Updated Date - 2022-07-28T23:08:33+05:30 IST