Harassment: అశ్లీల వీడియోలో ఉన్నది నేను కాదంటూ మహిళ మొత్తుకుంటున్నా వినిపించుకోని యువకులు.. చివరకు ఆమె తీసుకున్న నిర్ణయంతో..

ABN , First Publish Date - 2022-07-28T01:31:43+05:30 IST

బాలికలు, యువతులు, మహిళలు.. ఇలా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ నిత్యం ఏదో ఒక సమస్యతో సతమతమవుతుంటారు. కొందరు మహిళలకు ఇటు ఇంట్లో భర్త, అత్తమామల నుంచి.. అటు బయట...

Harassment: అశ్లీల వీడియోలో ఉన్నది నేను కాదంటూ మహిళ మొత్తుకుంటున్నా వినిపించుకోని యువకులు.. చివరకు ఆమె తీసుకున్న నిర్ణయంతో..
ప్రతీకాత్మక చిత్రం

బాలికలు, యువతులు, మహిళలు.. ఇలా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ నిత్యం ఏదో ఒక సమస్యతో సతమతమవుతుంటారు. కొందరు మహిళలకు ఇటు ఇంట్లో భర్త, అత్తమామల నుంచి.. అటు బయట కొందరు శాడిస్టుల నుంచి వేధింపులు ఎదురవుతుంటాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు చివరకు విషాద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. మరికొన్ని ఘటనల్లో మహిళలు సమస్యలపై ధైర్యంగా పోరాటం చేస్తుంటారు. రాజస్థాన్‌లో ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. అశ్లీల వీడియోల్లో ఉన్నది నువ్వేనంటూ ఓ మహిళను యువకులు వేధించారు. ఈ ఘటనలో చివరకు ఏం జరిగిందంటే.. 


రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రం భరత్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న6 నెలల గర్భిణిని కొందరు యువకులు టార్గెట్ చేశారు. రోజూ ఆమెను చూసి వేధించడం మొదలెట్టారు. సోషల్ మీడియాలో వైరల్ (viral) అవుతున్న పాత అశ్లీల వీడియోను ( Indecent video) చూపించి, ఇందులో ఉన్నది నువ్వేనంటూ ఎగతాళి చేసేవారు. అందులో ఉన్నది నేను కాదు.. నన్ను వదిలేయండి.. అంటూ పదే పదే అమె వారిని ప్రాథేయపడింది. అయినా యువకులు మాత్రం రోజూ ఆమెను మానసికంగా వేధించేవారు.

drone saved boy: అలల్లో చిక్కుకున్న బాలుడిని రక్షించిన డ్రోన్.. అదెలాగో మీరే చూడండి.. 


చివరకు ఈ సమస్య గ్రామ పెద్దల వరకూ వెళ్లింది. దీంతో జూలై 21న గ్రామంలో పంచాయితీ పెట్టారు. అయినా యువకుల్లో మాత్రం మార్పు రాలేదు. చివరకు చేసేదేమీ లేక బాధితురాలు.. పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. పంజాబీ గాయకుడి (Punjabi singer) కుమారుడు, అతడి స్నేహితురాలికి సంబంధించిన అశ్లీల వీడియోను చూపించి వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. తనకు సునాయాస మరణానికి అనుమతి ఇవ్వాలని వేడుకుంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు ఐదుగురు యువకులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Wife planned: భార్య హత్య కేసులో భర్త అరెస్ట్.. నెలన్నర తర్వాత అనుకోకుండా మహిళ ప్రత్యక్షం.. ఇంతకీ ఆమె చేసిన పనేంటంటే..



Updated Date - 2022-07-28T01:31:43+05:30 IST