Wife planned: భార్య హత్య కేసులో భర్త అరెస్ట్.. నెలన్నర తర్వాత అనుకోకుండా మహిళ ప్రత్యక్షం.. ఇంతకీ ఆమె చేసిన పనేంటంటే..

ABN , First Publish Date - 2022-07-27T22:42:44+05:30 IST

ఆమెకు వివాహమై కొడుకు కూడా ఉన్నాడు. ఆనందంగా జీవితం గడుపుతున్న వారి సంసారంలో అనుకోని సమస్యలు వచ్చిపడ్డాయి. సడన్‌గా భార్య అదృశ్యమైంది. తమ కూతురును అల్లుడే హత్య చేశాడని..

Wife planned: భార్య హత్య కేసులో భర్త అరెస్ట్.. నెలన్నర తర్వాత అనుకోకుండా మహిళ ప్రత్యక్షం.. ఇంతకీ ఆమె చేసిన పనేంటంటే..

ఆమెకు వివాహమై కొడుకు కూడా ఉన్నాడు. ఆనందంగా జీవితం గడుపుతున్న వారి సంసారంలో అనుకోని సమస్యలు వచ్చిపడ్డాయి. సడన్‌గా భార్య అదృశ్యమైంది. తమ కూతురును అల్లుడే హత్య చేశాడని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో భర్తను అరెస్ట్ (arrest) చేసి జైలుకు పంపించారు. అయితే నెలన్నర తర్వాత ఈ కేసులో షాకింగ్ ట్విస్టు (shocking twist) చోటు చేసుకుంది. చనిపోయిందనుకున్న మహిళ సడన్‌గా ప్రత్యక్షమైంది. చివరకు ఆమె చేసిన పని తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..


బీహార్‌ (Bihar) రాష్ట్రం తూర్పు చంపారన్ జిల్లా (Champaran district) పరిధి నిముయి అనే ప్రాంతంలో షేక్ సద్దాం అనే వ్యక్తి భార్య నజ్నీన్ ఖాతున్, కొడుకుతో జీవనం సాగిస్తున్నాడు. సంతోషంగా సాగుతున్న వీరి సంసారంలో అనుకోని సమస్యలు వచ్చిపడ్డాయి. నెలన్నర క్రితం భార్య ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. అదే క్రమంలో ఊరి శివారులో గుర్తుతెలియని మహిళ మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. దీంతో తమ కూతురును అల్లుడే హత్య చేశాడని షఫీ అహ్మద్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, షేక్ సద్దాంను అరెస్ట్ చేశారు. తమ కొడుకు నిర్దోషి అని షేక్ సద్దాం తల్లిదండ్రులు ఎంత ప్రాథేయపడినా పోలీసులు వినిపించుకోలేదు.

Marriage bureau cheats woman: పెళ్లి కాకుండానే వివాహితగా మారిన యువతి.. చివరకు మ్యారేజ్ బ్యూరో ఆపరేటర్ నిర్వాకం తెలుసుకుని అంతా షాక్..


అయితే నెలన్నర తర్వాత ఈ కేసులో షాకింగ్ ట్విస్టు చోటు చేసుకుంది. మోతిహారి నగరంలో నజ్నీన్ ఖాతున్‌ బతికే ఉన్నట్లు తెలిసింది. పోలీసుల విచారణలో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగించిన నజ్నీన్ ఖాతున్‌.. కొడుకుతో సహా పరారైనట్లు తెలిసింది. తాన భర్తను హత్య కేసులో ఇరికించేందుకు ప్రియుడితో కలిసి ప్లాన్ వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నజ్నీన్ ఖాతున్‌ బతికే ఉండడంతో షేక్ సద్దాం త్వరలో జైలు నుంచి విడుదల కానున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.

భార్యాభర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆస్పత్రిలో వారు చేసిన నిర్వాకం తెలుసుకుంటే.. వామ్మో అని మీరే అంటారు..



Updated Date - 2022-07-27T22:42:44+05:30 IST