భార్యాభర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆస్పత్రిలో వారు చేసిన నిర్వాకం తెలుసుకుంటే.. వామ్మో అని మీరే అంటారు..

ABN , First Publish Date - 2022-07-27T02:47:00+05:30 IST

ఆమె ఓ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. రోగులకు సహాయకారిగా ఉండాల్సిన ఆమె.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. ఓ మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు..

భార్యాభర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆస్పత్రిలో వారు చేసిన నిర్వాకం తెలుసుకుంటే.. వామ్మో అని మీరే అంటారు..
ప్రతీకాత్మక చిత్రం

ఆమె ఓ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. రోగులకు సహాయకారిగా ఉండాల్సిన ఆమె.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. ఓ మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. చివరకు నర్సు, ఆమె భర్తను కూడా అరెస్ట్ చేశారు. ఆ నర్సు ఆస్పత్రిలో చేసిన నిర్వాకం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. ఇలాంటి నర్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..


మహారాష్ట్ర (Maharashtra) లోని కొల్హాపూర్ తాస్గావ్‌ పరిధిలోని పంధర్‌పూర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మోహోల్‌ అనే ప్రాంతానికి చెందిన ఓ గర్భిణి ప్రసవం కోసం ప్రైవేట్ ఆస్పత్రి (Hospital) లో అడ్మిట్ అయింది. ఆదివారం ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ విషయాన్ని మహిళ భర్తకు తెలీకుండా దాచిపెట్టారు. పుట్టిన కొద్ది గంటలకే శిశువు కనిపించలేదు. దీంతో మహిళతో పాటూ కుటుంబ సభ్యులంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆస్పత్రిలోని సీసీ పుటేజీని పరిశీలించారు.

Father Risk for Daughters: కూతుళ్ల కోసమే జైలు నుంచి పారిపోయాడు.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ కూతుళ్ల కోసమే లొంగిపోయిన ఓ తండ్రి కథ..!


విచారణలో చివరకు షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్పత్రిలో పని చేసే స్వాతి చాబు అనే నర్సు.. బిడ్డను అపహరించినట్లు తెలుసుకున్నారు. ఆదివారం రాత్రి సాంగ్లీ జిల్లాలోని భవానీ నగర్‌లో ఉంటున్న నిందితురాలిని, ఆమెకు సహకరించిన భర్తనూ అరెస్ట్ చేశారు. నిందితురాలికి గతంలో నర్సుగా పని చేసిన అనుభవం ఉందని, ప్రస్తుతం నకిలీ పేరుతో ఆస్పత్రిలో నర్సుగా చేరినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి నర్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Boy Tortured by Villagers: 10 ఏళ్ల బాలుడిని కొడుతూ ఊరంతా తిప్పి.. చివరకు చెట్టుకు కట్టేసి చిత్రహింసలు.. అసలేం జరిగిందంటే..



Updated Date - 2022-07-27T02:47:00+05:30 IST