ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Boy Tortured by Villagers: 10 ఏళ్ల బాలుడిని కొడుతూ ఊరంతా తిప్పి.. చివరకు చెట్టుకు కట్టేసి చిత్రహింసలు.. అసలేం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-07-26T22:59:58+05:30

తెలిసీ తెలీని వయసులో అతడు చేసిన చిన్న తప్పు.. అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. బాలుడని కూడా చూడకుండా ఆ గ్రామస్తులు చేసిన నిర్వాకంపై ప్రజలు మండిపడుతున్నారు. పదేళ్ల బాలుడిని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలిసీ తెలీని వయసులో అతడు చేసిన చిన్న తప్పు.. అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. బాలుడని కూడా చూడకుండా ఆ గ్రామస్తులు చేసిన నిర్వాకంపై ప్రజలు మండిపడుతున్నారు. పదేళ్ల బాలుడిని కొడుతూ ఉరంతా తిప్పారు. అంతటితో ఆగకుండా చెట్టకు కట్టేసి చిత్రహింసలకు గురిచేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవడంతో పోలీసులు కేసుల నమోదు చేశారు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


బీహార్ (Bihar) రాష్ట్రం బెట్టియాలోని పశ్చిమ చంపారన్ జిల్లా లౌరియా బ్లాక్ బసంత్‌పూర్ పంచాయతీ ఛరద్వాలి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో ఇటీవల చోరీ (theft) జరిగింది. ఓ పదేళ్ల బాలుడిపై గ్రామస్తులు (Villagers) అనుమానం వ్యక్తం చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా బాలుడిపై తమ ప్రతాపాన్ని చూపించారు. అతడిని బలవంతంగా లాక్కొచ్చి, చేతులు కట్టేసి చితకబాదారు. ఊరంతా తిప్పుతూ అంతా చూస్తుండగా అతడిపై అమానవీయంగా దాడి చేశారు. అంతా చూస్తుండిపోయారు తప్ప.. ఒక్కరు కూడా అతడిని కాపాడే ప్రయత్నం చేయలేదు.

Shocking decision: మీ కూతురు ఎక్కడ అని అడిగితే.. గండె పోటుతో చనిపోయిందని చెప్పండి.. అని లేఖ రాసి.. 15 ఏళ్ల బాలిక చేసిన పని..



చివరకు గ్రామ పెద్దలు, కొందరు యువకులు కలిసి బాలుడిని చెట్టుకు కట్టేసి మరీ దాడి చేశారు. నన్ను వదలండంటూ దండం పెడుతున్నా కనికరించలేదు. పైగా ఈ ఘటనను మొత్తం వీడియో కూడా తీశారు. ఈ చోరీ తానే చేసినట్లుగా బాలుడితో బలవంతంగా పేపర్‌పై సంతకాలు కూడా చేయించుకున్నారు. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social media) లో వైరల్ (Viral) అవడంతో పోలీసుల వరకూ వెళ్లింది. జూలై 20న జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలియడంతో గ్రామ పెద్దలు తదితరులు పరారీలో ఉన్నారు. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Father Risk for Daughters: కూతుళ్ల కోసమే జైలు నుంచి పారిపోయాడు.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ కూతుళ్ల కోసమే లొంగిపోయిన ఓ తండ్రి కథ..!



Updated Date - 2022-07-26T22:59:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising