ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Girl selfie video: నా వయసు 17ఏళ్లు.. నాకు జరిగిన అన్యాయాన్ని మా అమ్మకు చెప్పినా పట్టించుకోలేదు.. పైగా.. అంటూ ఓ బాలిక చెప్పింది విని..

ABN, First Publish Date - 2022-07-31T01:11:44+05:30

ఆ కుటుంబంలో బాలికకు బయటికి చెప్పుకోలేని సమస్య తలెత్తింది. తనకు జరిగిన అన్యాయాన్ని చాలా రోజులు భరించింది. అయినా రోజురోజుకూ వేధింపులు ఎక్కువ అవుతుండడంతో చివరకు తన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ కుటుంబంలో బాలికకు బయటికి చెప్పుకోలేని సమస్య తలెత్తింది. తనకు జరిగిన అన్యాయాన్ని చాలా రోజులు భరించింది. అయినా రోజురోజుకూ వేధింపులు ఎక్కువ అవుతుండడంతో చివరకు తన తల్లికి వివరించింది. అయినా ఆమె కూడా పట్టించుకోలేదు. పైగా బాలికపైనే ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో చివరకు తన అక్క సహకారంతో.. సమస్య పోలీసుల వరకూ వెళ్లింది. ఈ ఘటను గురించి తెలుసుకున్న వారంతా.. అయ్యో! ఏ ఆడపిల్లకూ ఇలాంటి సమస్య రావొద్దు.. అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


బాధితురాలి కథనం మేరకు.. హర్యానా (Haryana) రాష్ట్రం పానిపట్ జిల్లా పరిధికి చెందిన ఓ వ్యక్తికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరి పెద్ద కుమార్తెకు  2015లో వివాహం చేశారు. ఇదిలావుండగా, 17ఏళ్ల చిన్న కుమార్తెకు ఇటీవల కలలో కూడా ఊహించని సమస్య (problem) తలెత్తింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఆమెపై కన్నేశాడు. తరచూ కుమార్తెను శారీరకంగా వేధించేవాడు. ఈ క్రమంలో పలుమార్లు అత్యాచారానికి కూడా పాల్పడ్డాడు. బయట ఎవరికీ చెప్పుకోలేక కొన్నాళ్లు అలాగే భరించింది. అయితే రోజురోజుకూ వేధింపులు (Harassment) ఎక్కువ అవడంతో తన తల్లికి చెప్పింది. అయితే ఆమె దండించకపోగా.. భర్తకే మద్దతు ఇచ్చింది. దీంతో తన సమస్యను వివరిస్తూ.. ‘‘నా వయసు 17ఏళ్లు.. నాకు జరిగిన అన్యాయాన్ని మా అమ్మకు చెప్పినా పట్టించుకోలేదు’’.. అంటూ ఓ వీడియో (Video) తీసింది. 

husband attacked wife: ఆటోలో అత్తగారి ఇంటికి వచ్చిన కోడలు.. మరుక్షణమే డ్రైవర్‌తో సహా యువతిని చెట్టుకు కట్టేసిన వైనం.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


చివరకు చెల్లెలికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్న అక్క.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి కాక ముందు తనపై కూడా తండ్రి దారుణానికి పాల్పడ్డాడని, తనకు వివాహమవడంతో తన చెల్లెలిని టార్గెట్ చేశాడని చెప్పింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ప్రస్తుతం నిందితుడి కుటుంబ సభ్యులు బాలికపై రోజూ ఒత్తిడి తెస్తున్నారు. జైల్లో ఉన్న తండ్రిని ఎలాగైనా బయటి తేవాలని, లేదంటే అక్కాచెల్లెళ్లను జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారు. తన చెల్లెలి సమస్యకు సంబంధించిన వీడియోను వైరల్ చేసి, ఇక మీద ఎవరికీ ఇలా జరగకుండా చేయాలని బాధితురాలి అక్క వేడుకుంటోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

student love: మధ్యాహ్న సమయంలోనూ తలుపులు మూసిన విద్యార్థి.. ఎంత తట్టినా తీయకపోవడంతో బద్దలు కొట్టి చూడగా..



Updated Date - 2022-07-31T01:11:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising