husband attacked wife: ఆటోలో అత్తగారి ఇంటికి వచ్చిన కోడలు.. మరుక్షణమే డ్రైవర్‌తో సహా యువతిని చెట్టుకు కట్టేసిన వైనం.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-07-30T21:22:44+05:30 IST

కొన్నిసార్లు కళ్లతో చూసింది కూడా నిజం కాకపోవచ్చు. ఈ విషయం తెలుసుకోలేని కొందరు భర్తలు.. భార్యలపై లేనిపోని అపోహలు పెట్టుకుని చిత్రహింసలకు గురి చేస్తుంటారు. చివరకు...

husband attacked wife: ఆటోలో అత్తగారి ఇంటికి వచ్చిన కోడలు.. మరుక్షణమే డ్రైవర్‌తో సహా యువతిని చెట్టుకు కట్టేసిన వైనం.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

కొన్నిసార్లు కళ్లతో చూసింది కూడా నిజం కాకపోవచ్చు. ఈ విషయం తెలుసుకోలేని కొందరు భర్తలు.. భార్యలపై లేనిపోని అపోహలు పెట్టుకుని చిత్రహింసలకు గురి చేస్తుంటారు. చివరకు జైల్లో ఊచలు లెక్కెడుతుంటారు. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడోచోట జరుగుతూనే ఉన్నాయి. రాజస్థాన్‌లో తాజాగా ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన అత్తగారి ఇంటికి ఆటోలో వచ్చింది. అత్తకు అనుమానం వచ్చి కొడుకు, తదితరులకు సమాచారం ఇచ్చింది. దీంతో మరుక్షణమే భార్యను, ఆటో డ్రైవర్‌ను చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రం బన్స్వారా జిల్లాలోని ఘటోల్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెహార్‌ అనే ప్రాంతానికి చెందిన ఓ యువతి (young woman) కి ముడసెల్‌కు చెందిన మహావీర్ అనే వ్యక్తితో ఆరు నెలల క్రితం వివాహమైంది. అనంతరం యువతి అత్తగారింట్లో అందరితో సంతోషంగా గడిపేది. అయితే ఈ క్రమంలో యువతి జూలై 24న వ్యక్తిగత పనుల మీద ఘటోల్ పట్టణానికి వెళ్లింది. అక్కడ తన పాత స్నేహితుడైన దేవిలాల్‌ను కలుసుకుంది. పట్టణంలో పని పూర్తి చేసుకున్న తర్వాత తనను అత్తగారి ఇంటి వద్ద దింపాలని కోరడంతో దేవిలాల్ ఆమెను తన సొంత ఆటోలో తీసుకెళ్లి దింపాడు. అయితే కోడలు పరాయి వ్యక్తితో ఆటోలో రావడాన్ని సహించలేని అత్త.. విషయాన్ని కొడుక్కు తెలియజేసింది.

Girl blackmail: ఫోన్లో నాలుగేళ్లుగా దాచిన వీడియోలు ఒక్కసారిగా వెలుగులోకి.. ఎంత పని జరిగిందంటూ యువతి షాక్.. చివరకు ఏమైందంటే..


దీంతో వెంటనే భర్త (husband) అక్కడికి చేరుకుని.. తన భార్యతో సహా ఆటో డ్రైవర్‌ను కూడా చెట్టుకు కట్టేసి చితకబాదారు. సుమారు 7గంటల పాటు వారిని చిత్రహింసలకు గురి చేశారు. అనంతరం గ్రామపెద్దలు కలుగజేసుకుని, ఆటో డ్రైవర్ నుంచి డబ్బులు తీసుకుని పంచాయితీ చేశారు. ఇదిలావుండగా, దాడికి సంబంధించిన వీడియోలు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు శనివారం బాధితురాలి భర్తతో సహా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి, ఆటో డ్రైవర్‌కు మధ్య స్నేహం మాత్రమే ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, దాడి ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.

Physical teacher కి ఫోన్ చేసి ఇంటికి పిలిచి.. కాసేపటికి బాత్‌రూంలోకి వెళ్లిన మహిళ.. మరుక్షణంలో దిమ్మదిరిగే షాక్..



Updated Date - 2022-07-30T21:22:44+05:30 IST