ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దారుణం.. 5 ఏళ్ల బాలుడి కాళ్లను పట్టుకుని.. గాల్లో గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడు..!

ABN, First Publish Date - 2022-12-13T20:11:54+05:30

రోజురోజుకూ మనుషుల్లో మానవత్వం కనుమరుగవుతోంది. చాలా మంది చిన్న చిన్న సమస్యలనూ పెద్దవి చేసి, చివరకు హత్యలు చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. కొందరైతే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోజురోజుకూ మనుషుల్లో మానవత్వం కనుమరుగవుతోంది. చాలా మంది చిన్న చిన్న సమస్యలనూ పెద్దవి చేసి, చివరకు హత్యలు చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. కొందరైతే కనీసం చిన్న పిల్లలు అని కూడా దారుణంగా ప్రవర్తిస్తుంటారు. యూపీలోని ప్రతాప్‌గఢ్‌లో హృదయ విదారక ఘటన చోసుకుంది. క్షణికావేశంలో ఓ వ్యక్తి ఐదేళ్ల పిల్లాడి కాళ్లు పట్టుకుని, గిరగిరా గాల్లో తిప్పి నేలకేసి కొట్టాడు. స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

వాకింగ్ చేస్తుండగానే గుండెపోటు.. నడిరోడ్డు మీదే కిందపడిపోయిన 61 ఏళ్ల వృద్ధుడు.. ఈ పోలీసమ్మే లేకుంటే..!

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఉదయపూర్ పరిధి భగవత్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కమలేష్ అనే వ్యక్తికి భార్య, పిల్లలు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదిలావుండగా, ఇటీవల ఓ రోజు కమలేష్ ఐదేళ్ల కొడుకు (five year old boy) పుస్తకాలు కొనుక్కునేందుకు రోడ్డుపైకి వెళ్లాడు. అదే సమయంలో అరవింద్ అనే ఓ వ్యక్తి కుటుంబ సభ్యులతో గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన అరవింద్.. ఆ కోపాన్నంతా చిన్నారిపై చూపించాడు. వెంటనే చిన్నారి వద్దకు వెళ్లిన అతడు.. బాలుడి రెండు కాళ్లను పట్టుకుని, గాల్లో గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడు.

Gold Stock End’s: బంగారానికి వార్నింగ్ బెల్స్.. 20 ఏళ్ల తర్వాత బంగారం కనిపించదు..!?

దీంతో చిన్నారి తలకు (Head injuries) తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి (Death) చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ వార్త విన్న తల్లిదండ్రులు బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఇప్పటి వరకూ కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందలేదని, అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

మసాజర్ కోసం వెతుకుతుండగా.. ఆన్‌లైన్‌లో కనిపించిన భార్య ఫొటోలు.. అందులో ఇచ్చిన నంబర్‌కు కాల్ చేయగా...

Updated Date - 2022-12-13T20:15:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising