ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

EAGLE Act of 2022: ‘గ్రీన్‌ కార్డు కోటా’పై అగ్రరాజ్యంలో కీలక బిల్లు.. పాసైతే ప్రవాస భారతీయులకు పండగే!

ABN, First Publish Date - 2022-12-09T08:23:02+05:30

ప్రవాస భారతీయ అమెరికన్లకు అతి పెద్ద ఊరట..! ‘‘ప్రతిభకే ప్రాధాన్యం.. పుట్టిన ప్రదేశానికి కాదు’’ అంటూ వారికి అగ్రరాజ్యం తీపి కబురు చెప్పబోతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, డిసెంబరు 8: ప్రవాస భారతీయ అమెరికన్లకు అతి పెద్ద ఊరట..! ‘‘ప్రతిభకే ప్రాధాన్యం.. పుట్టిన ప్రదేశానికి కాదు’’ అంటూ వారికి అగ్రరాజ్యం తీపి కబురు చెప్పబోతోంది. ఇప్పటివరకు దేశానికి ఇంత అని ఉన్న నిర్దేశిత గ్రీన్‌ కార్డు కోటాను (Green cards Country Quota) ఎత్తివేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రతిపాదించిన బిల్లు.. ఈక్వల్‌ యాక్సెస్‌ టు గ్రీన్‌ కార్డ్స్‌ ఫర్‌ లీగల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (ఈగల్‌) చట్టం-2022 (EAGLE Act of 2022) ఈ వారం అమెరికా ప్రతినిధుల సభ ముందుకు రానుంది. దీనిపై ఓటింగూ జరగనుంది. ఈగల్‌ బిల్లుకు అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ కూడా మద్దతు ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ఆమోదానికి అడ్డంకి ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే.. అమెరికాలోని కంపెనీలు ప్రతిభ ఆధారంగా ఉద్యోగుల ఎంపికకు ప్రాధాన్యం ఇస్తాయి. తద్వారా సహజంగానే వేలాదిమంది ప్రవాస భారతీయులకు (Indian American) మేలు చేకూరనుంది. రెండేళ్లుగా ఇమ్మిగ్రెంట్‌ వీసా బ్యాక్‌లాగ్‌లో ఉన్నవారు గ్రీన్‌కార్డుకు (Green Card) దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించడం సహా పలు ప్రయోజనాలు ఈగల్‌ బిల్లులో ఉన్నాయి.

Updated Date - 2022-12-09T08:52:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising